P Krishna
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ముమ్మర ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ముమ్మర ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.
P Krishna
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కొనసాగుతుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ముమ్మర ప్రచారంలో మునిగిపోయింది. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. మరో వైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు సైతం ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ తాజ్ దక్కన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ తాజ్ దక్కన్ లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. గత పాతికేళ్లలో మనకు గుర్గుకు వచ్చేది ముగ్గురే ముఖ్యమంత్రులు.. ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్భన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని.. ప్రో రూరల్, ప్రో పూర్, ప్రో అగ్రికల్చర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని., ఇక కేసీఆర్ లో ఆ రెండూ కనిపిస్తాయి అని అన్నారు. అందుకే ఆయనను విజన్ ఉన్న నేత అని అంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు దీవించారు.
కేసీఆర్ అంటే ప్రో రూరల్, ప్రో ఐటీ, ప్రో అగ్రికల్చర్, ప్రో అర్భన్, ప్రో పూర్ ఇలా అన్నీ ఆయనలో కనిపిస్తాయి. అభివృద్ది కాంక్షించే నేత., అందుకే ఆయన పాలనకు ప్రజలు నీరాజనాలు పలికారు. మంచినీళ్లు, 24 గంటలు కరెంట్ ఇవ్వడం.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడం ఆయనకే చెల్లింది. కేసీఆర్ కు సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది కనుకనే ఆయన మంచి పరిపాలన చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో అన్నదాతలు ఆస్తులు అమ్ముకున్నా అప్పులు తీరని దుస్థితి.. కానీ ఇప్పుడు రైతులు ధీమాగా ఉన్నారు. ఇదీ బీఆర్ఎస్ సుస్థిర పాలనకు నిదర్శనం, సమర్ధవంతమైన నాయకత్వం అని అన్నారు.