iDreamPost
android-app
ios-app

వీడియో: ఎన్నికల వేళ రేవంత్ సెల్ఫ్ గోల్! YSR స్థాయి నీది కాదు బాస్!

ఎన్నికల వేళ రాజకీయ నేతలు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఏ మాత్రం ఏమరపాటు ప్రదర్శించి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. తనతో పాటు పార్టీకీ చాలా నష్టం జరుగుతుంది. తాజాగా వైఎస్సార్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

ఎన్నికల వేళ రాజకీయ నేతలు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఏ మాత్రం ఏమరపాటు ప్రదర్శించి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. తనతో పాటు పార్టీకీ చాలా నష్టం జరుగుతుంది. తాజాగా వైఎస్సార్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

వీడియో: ఎన్నికల వేళ రేవంత్ సెల్ఫ్ గోల్! YSR స్థాయి నీది కాదు బాస్!

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఇక గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రోజుకు నాలుగైదు సభలు నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఈ సారి తెలంగాణ ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఈ సారి ప్రజలు ఎవరి వైపు చూస్తారనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇలాంటి నేపథ్యంలో కొందరు నేతలు విచిత్రమైన వ్యాఖ్యలు చేసి… పార్టీకి నష్టం చేకూరేలే చేస్తుంటారు. అలాంటి వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరారు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ… ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అలానే టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలపై  ప్రస్తావిస్తుంటారు. అలానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇచ్చి ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా వివరిస్తుంటారు. ఈ ప్రచారంలో దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన గురించి ప్రస్తావిస్తుంటాడు. ఇలానే ఇటీవల ఓ  ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్సార్ గురించి ప్రస్తావించారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..20 ఏళ్లగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిపాలను పోస్టు మార్టం చేసి..ప్రతి ముఖ్యమంత్రిని ప్రశ్నించే వాడనని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉతికి అరేశానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కి ఉన్న చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అలాంటి వ్యక్తి గురించి ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడటం సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేక పోతున్నారు.

అసలు రాజశేఖర్ రెడ్డి స్థాయి ఎక్కడ, రేవంత్ స్థాయి ఎక్కడ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే నాటికి రేవంత్ ఏ స్థితిలో ఉన్నాడో గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే నాటికి రేవంత్ రెడ్డి కేవలం ఓ జెడ్పీటీసీ మెంబర్ మాత్రమే అనే విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావించేది పోయి.. ఆయననే ఉతికారేశాను అనడం ఏంటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో ఉంటూ.. ఆ  పార్టీకి చెందిన మహానేతపై అలాంటి  వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద మిస్టేక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రేవంత్ తనను తాను వైఎస్ స్థాయిలో ఊహించుకుంటున్నాడని, వైఎస్సార్ కి రేవంత్ కి పోలికేంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఎన్నికల్లో ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం తగ్గువగా ఉందని ఇలాంటి చౌక బారు మాటల ద్వారా, అందులోనూ పీసీసీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం పార్టీకే నష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ సెల్ఫీల్ గోల్ ఏంటని, వైఎస్సార్ స్థాయి నీది కాదు బాస్ అంటూ కాంగ్రెస్ పార్టీ వారే అంటున్నారు. వైఎస్సార్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. ఎన్నికల వేళ వైఎస్ పై రేవంత్ వ్యాఖ్యలు చేయడం.. కాంగ్రెస్ కి నష్టమనే వార్తలు వినిపిస్తోన్నాయి. మరి.. వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.