iDreamPost
android-app
ios-app

స్లో గా ఊపందుకుంటున్న 3BHK

  • Published Jul 08, 2025 | 4:30 PM Updated Updated Jul 08, 2025 | 4:30 PM

కోట్లు కోట్లు ఖర్చు చేసి.. బారి తారాగణం బారి హైప్ తో వచ్చే సినిమాలు కొన్నైతే.. మినిమమ్ బడ్జెట్ తో వచ్చే సినిమాలు మరికొన్ని. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలకు డిమాండ్ కొంచెం పెరిగింది. పెద్ద హీరోల సినిమాలతో పోటీగా వచ్చినా కూడా డీసెంట్ సక్సెస్ ను అందుకుంటున్నాయి.

కోట్లు కోట్లు ఖర్చు చేసి.. బారి తారాగణం బారి హైప్ తో వచ్చే సినిమాలు కొన్నైతే.. మినిమమ్ బడ్జెట్ తో వచ్చే సినిమాలు మరికొన్ని. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలకు డిమాండ్ కొంచెం పెరిగింది. పెద్ద హీరోల సినిమాలతో పోటీగా వచ్చినా కూడా డీసెంట్ సక్సెస్ ను అందుకుంటున్నాయి.

  • Published Jul 08, 2025 | 4:30 PMUpdated Jul 08, 2025 | 4:30 PM
స్లో గా ఊపందుకుంటున్న 3BHK

కోట్లు కోట్లు ఖర్చు చేసి.. బారి తారాగణం బారి హైప్ తో వచ్చే సినిమాలు కొన్నైతే.. మినిమమ్ బడ్జెట్ తో వచ్చే సినిమాలు మరికొన్ని. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలకు డిమాండ్ కొంచెం పెరిగింది. పెద్ద హీరోల సినిమాలతో పోటీగా వచ్చినా కూడా డీసెంట్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. పైగా థియేటర్స్ కంటే కూడా ఓటిటి లో వీటికి ఇంకాస్త ఎక్కువ వేల్యూనే ఉంటుంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సూర్య 3BHK కూడా ఇదే కోవలోకి చెందుతుంది. సిద్దార్ధ్ నటించాడు కాబట్టి ఒరిజినల్ తమిళ సినిమా అయినా.. దీనిని తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు.

ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ సినిమా చూస్తే కనెక్ట్ అవ్వాల్సిందే. సొంత ఇల్లు కట్టుకోవాలని కల ప్రతి ఒక్కరికి ఉంటుంది . ఓ మధ్య తరగతి కుటుంబానికి అది అందనంత దూరంలో ఉంటుంది. సరిగ్గా అదే ఎమోషన్స్ ను తెరమీద కళ్ళకు కట్టినట్లు చూపించారు. అద్దె ఇంట్లో ఉండే ఓ కుటుంబం మూడు పడకల సొంత ఇంటికి సాకారం చేసుకునేందుకు.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనేదే సినిమా కాన్సెప్ట్. సిద్దార్థ్, శరత్ కుమార్, దేవయాని ఇలా సీనియర్ క్యాస్టింగ్ ఈ కాన్సెప్ట్ ను క్లీన్ గా తెర మీద చూపించారు. కాస్త డ్రామా ఫేస్ ఎక్కువ అవ్వడంతో అక్కడక్కడ బోర్ కొట్టించినా కానీ.. సినిమా మాత్రం బాగానే ఆకట్టుకుంది.

చెన్నై రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే ఈ సినిమా ఆరు కోట్లకు పైగా వసూళ్లను సాదించిందట. ఓ రకంగా ఇది డీసెంట్ కలెక్షన్ ఏ అని చెప్పి తీరాల్సిందే. తెలుగులో ఇలాంటి స్ట్రెయిట్ సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. విజువల్ గ్రాండియర్స్ , భారీ సెట్స్ , ఎలివేషన్స్ లాంటి సినిమాలే వస్తున్నాయి. కానీ వీటి అన్నిటికి దూరంగా కుటుంబం అంత కలిసి కూర్చుని చూసే ఓ ఎమోషనల్ డ్రామా ఫేస్ వస్తే మాత్రం .. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చెప్పి తీరాల్సిందే. ఎలాగూ ఈ వారంలో చెప్పుకోదగిన రిలీజ్ లు లేవు కాబట్టి.. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే.. సిద్దార్ధ్ కెరీర్ లో చాలా కాలం తర్వాత ఓ మంచి హిట్ పడినట్లే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.