నందమూరి బాలకృష్ణ సినిమాలకు విరామం ఇవ్వనప్పటికీ అఖండ నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని భావిస్తున్నారంతా. ఎందుకంటే అఖండ ముందు ఆయన ఎన్నో ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలు కనీసం రూ.5-10 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాయి అంటే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలంటే మొదటిరోజే రూ.20-30 కోట్ల షేర్ వస్తాయి. అలాంటిది బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు ఫుల్ రన్ లో […]
పూనకాలు లోడింగ్ అని ఏ ముహూర్తంలో క్యాప్షన్ పెట్టుకున్నారో కానీ దానికి పూర్తి సార్థకత చేకూరుస్తూ వాల్తేరు వీరయ్య వసూళ్ల సునామి పది రోజులు పూర్తి చేసుకుంది. విపరీతమైన పోటీ, థియేటర్ల కొరత లాంటి ఇబ్బందులను తట్టుకుని మరీ విజేతగా నిలిచింది. రెండు వారాలు దాటకుండానే వంద కోట్ల షేర్ దాటేసి ట్రేడ్ నివ్వెరపోయేలా చేసింది. మరోవైపు వీరసింహారెడ్డి డెబ్భై కోట్ల మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతుంటే వారసుడు దాని బిజినెస్ రేంజ్ కు తగ్గట్టు సేఫ్ […]
ఎదిగేకొద్దీ ఒదగాలని సంస్కారం పెంచుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు. అదేంటో బాలకృష్ణ మాత్రం దీనికి భిన్నమైన రీతిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అభిమానులు పసిపిల్లాడి మనస్తత్వం అని ఏదో కవరింగ్ చేస్తారు కానీ వాస్తవానికి చూస్తే చాలా సందర్భాల్లో తన స్థాయికి తగని మాటలతో పలుచన కావడం గతంలో చూశాం. నిన్న జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవం సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ నాన్న గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అక్కడికి సంతోషం. ఎస్వి రంగారావు తదితరుల ప్రస్తావన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో అర డజనకు పైగా సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ మరో కొత్త సినిమా అంటూ తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయన లిస్టులో మరో కొత్త ప్రాజెక్ట్ చేరేలా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు మలినేని చెప్పడం విశేషం. నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి […]
నందమూరి బాలకృష్ణ తాజాగా వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి కాస్త మెరుగైన వసూళ్లే రాబట్టింది. జనవరి 12న విడుదలైన ఈ మూవీ వారం రోజుల్లో రూ.65 కోట్ల షేర్ రాబట్టింది. అయితే వీరసింహా హిట్ అనిపించుకోవాలంటే ఈ కలెక్షన్ల జోరు సరిపోదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని […]
సంక్రాంతి పండగ సెలవులు అయిపోయాయి. ఈ సీజన్ ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు ఈ అయిదారు రోజులను పూర్తిగా వాడేసుకున్నాయి. ముఖ్యంగా విజేతగా నిలిచిన చిరంజీవి ఊచకోత మాములుగా లేదు. మొదటివారం కాకుండా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్లడం ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. జనవరి 13 నుంచి నిన్నటి దాకా వీరయ్య కలెక్ట్ చేసిన షేర్ అక్షరాలా 83 కోట్లు. అంటే గ్రాస్ 144 కోట్ల […]
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మల్టీప్లెక్సులు కొత్త స్ట్రాటజీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ మధ్య నేషనల్ సినిమా డే ఆఫర్ కింద దేశవ్యాప్తంగా టికెట్ రేట్ ని 75కి అమ్మడంతో అప్పట్లో బ్రహ్మాస్త్రకు అద్భుతంగా పని చేసి వసూళ్లకు బాగా దోహదపడింది. తాజాగా పివిఆర్ మరోసారి అలాంటి ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 20న కేవలం 99 రూపాయలకు తమ చైన్ లోని ఏ స్క్రీన్ లో అయినా ఏ సినిమా అయినా సరే చూసే అవకాశం కలిగిస్తోంది. […]
భారీ అంచనాలు మోసుకొచ్చిన సంక్రాంతి బాక్సాఫీస్ పండగ కొలిక్కి వస్తోంది. సెలవులు పూర్తవుతున్నాయి కాబట్టి జనాలు ఇక రొటీన్ లైఫ్ లోకి వెళ్లిపోతున్నారు. విపరీతమైన పోటీ, పలు ఆసక్తికరమైన పరిణామాల మధ్య జనవరి టాలీవుడ్ విన్నర్ గా వాల్తేరు వీరయ్య సగర్వంగా జెండా ఎగరేసింది. వసూళ్లు ఇప్పటికే నూటా ఇరవై కోట్లకు దగ్గరగా ఉండగా యుఎస్ లో మొదటి వారం పూర్తి కాకుండా 2 మిలియన్ మార్క్ ఘనత స్వంతం చేసుకోనుంది. హంగామాతో వచ్చిన వీరసింహారెడ్డి ఎంత […]
దారినపోయే దుమ్ముని తలకు రాసుకుంటే మట్టి అంటేది మనకే. సామాన్యులకు పెద్ద ఇబ్బందేమీ లేదు కానీ సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాంట్రావర్సీలకు బలి కావాల్సి ఉంటుంది. తమన్ అదే ట్రాప్ లో పడ్డాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో జై బాలయ్య నినాదం తెలుగు రాష్ట్రాల్లో గోవిందా గోవిందా నామస్మరణ అంత పాపులర్ అని అందుకే రెండుసార్లు ఆ పదం మీద ట్యూన్ కట్టానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పవర్ […]
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డిపై విడుదలకు ముందు ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే తగ్గట్లే ఈ చిత్రం మొదటి రోజు బాలయ్య కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. కానీ ఊహించని విధంగా రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి. దీంతో బిగ్గెస్ట్ హిట్ సంగతి తర్వాత.. అసలు ముందు […]