iDreamPost
android-app
ios-app

బబ్లీ గర్ల్ హనీ రోజ్ ఎక్కడ.? తెలుగులో ఎందుకు కనిపించడం లేదంటే?

Honey Rose: బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హనీ రోజ్. ఒక్క మూవీతోనే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ బబ్లీ గర్ల్. ఇక తెలుగులో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు. కానీ అనూహ్యంగా..

Honey Rose: బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హనీ రోజ్. ఒక్క మూవీతోనే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ బబ్లీ గర్ల్. ఇక తెలుగులో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు. కానీ అనూహ్యంగా..

బబ్లీ గర్ల్  హనీ రోజ్ ఎక్కడ.? తెలుగులో ఎందుకు కనిపించడం లేదంటే?

గత ఏడాది బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఒకటి వీర సింహా రెడ్డి. 2023 సంక్రాంతిని టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్ కొట్టింది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ పోషించాడు. పులిచెర్ల వీర సింహా రెడ్డిగా, అలాగే జై సింహా రెడ్డిగా పవర్ ఫుల్ ఫెర్మామెన్స్ ఇచ్చాడు. ఇక ఇందులో శృతి హాసన్ మెయిన్ హీరో కాగా, వీర సింహారెడ్డి చెల్లెలిగా మెప్పించింది వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే మరో బ్యూటీగా మెప్పించింది. వీర సింహారెడ్డి భార్యగా మీనాక్షి పాత్రలో మెరిసింది హనీ రోజ్. వయస్సుకు మించిన పాత్ర పోషించినప్పటికీ.. బాగా క్లిక్ అయ్యింది. తన చబ్చీ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. ‘ ఇక నా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయో’ సాంగ్‌లో కాసేపే కాలు కదిపినప్పటికీ కుర్రకారు గుండెల్ని మెలిపెట్టేసింది. ఇందులో యంగ్‌గా కనిపించే స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ.. ఉన్నంతలో బాగా యాక్ట్ చేసింది.

ఈ ఒక్క సినిమాతోనే విపరీతమైన పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంది హనీ రోజ్. ఈ మూవీతో వరుస అవకాశాలు క్యూ కడతాయని అనుకున్నారంతా.. కానీ ఊహించని విధంగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ డ్రెస్సులో, శారీల్లో కేక పుట్టించిన హనీ బేబీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం దర్శన భాగ్యం ఇవ్వడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. ఆమె మలయాళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు రేచల్ అనే మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనంతిని బాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ రెండు నెలల క్రితం రిలీజైంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఇందులో హనీరోజ్ కఠినాత్మురాలిగా, డీ గ్లామర్డ్ పాత్రలో కనిపించింది. ఇదే సినిమాతో పాటు తేరీ మేరీ అనే మూవీ కూడా చేస్తుంది. మలయాళంలో బిజీగా గడపడం వల్ల తెలుగుపై ఫోకస్ పెట్టలేకపోతున్నట్లు సమాచారం.

తన 14 ఏళ్ల వయస్సులోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసింది హనీ రోజ్. కేరళకు చెందిన ఈ కుట్టీ.. బాయ్ ఫ్రెండ్ అనే మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వెంటనే కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్‌ల్లో మెరిసింది. తెలుగులో వీర సింహారెడ్డి కన్నా ముందే మరో మూవీ చేసింది. అదే ఆలయం అనే సినిమా. ఇందులో శివాజీ హీరో. ఇందులో చాలా సన్నగా.. కనిపిస్తుంది ఈ బ్యూటీ. మళ్లీ తనకు అచ్చొచ్చిన మలయాళ, తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.  త్రివేండ్రం లాడ్జ్, కనల్, వారి రాత్రులు, గాడ్స్ ఓన్ క్లీటస్, చంక్స్, యు టూ బ్రూటస్, ఇట్టిమని: మేడ్ ఇన్ చైనా, బిగ్ బ్రదర్, పట్టం పూచీ, ఆక్వేరియం, మాన్‌స్టర్ చిత్రాలతో మంచి పాత్రలు పోషించింది. హనీ నటించిన తాజా చిత్రం రేచల్ త్వరలోనే తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది.