iDreamPost
ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే కంటెంట్ లా అనిపించింది కానీ ఓవరాల్ గా చూస్తే స్టోరీ పరంగా పాత్రల కోణంలో అన్నీ గతంలో చూసిన ఫ్యాక్షన్ సినిమాల మిక్సీలాగా కామన్ ఆడియన్స్ కి అనిపించే అవకాశం లేకపోలేదు.
ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే కంటెంట్ లా అనిపించింది కానీ ఓవరాల్ గా చూస్తే స్టోరీ పరంగా పాత్రల కోణంలో అన్నీ గతంలో చూసిన ఫ్యాక్షన్ సినిమాల మిక్సీలాగా కామన్ ఆడియన్స్ కి అనిపించే అవకాశం లేకపోలేదు.
iDreamPost
నిన్న ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ దర్శకులు బి గోపాల్ చేతుల మీద ట్రైలర్ లాంచ్ జరిగింది. ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే కంటెంట్ లా అనిపించింది కానీ ఓవరాల్ గా చూస్తే స్టోరీ పరంగా పాత్రల కోణంలో అన్నీ గతంలో చూసిన ఫ్యాక్షన్ సినిమాల మిక్సీలాగా కామన్ ఆడియన్స్ కి అనిపించే అవకాశం లేకపోలేదు. లెజెండ్ తరహాలో ఒక పాత్ర విదేశాల్లో మరో క్యారెక్టర్ ఇక్కడ సీమలోని ఊళ్ళో ఎస్టాబ్లిష్ చేసి పగలతో రగిలిపోయే ఒక శత్రువు, అతని ఇంట్లో హీరో వల్ల నష్టపోయిన ఒక వితంతువు ఇవన్నీ నరసింహనాయుడు, సింహాలాంటి వాటితో గతంలో బోయపాటి శీను, గోపాల్ లాంటి వాళ్ళు చేసి చూపించి హిట్లు కొట్టినవే.
గోపిచంద్ మలినేని వీరసింహారెడ్డి విషయంలో సేఫ్ గేమ్ ఆడినట్టు కనిపిస్తోంది. ఊర మాస్ పవర్ ఫుల్ డైలగులు సైతం రెగ్యులర్ ఫ్లోలో వెళ్లాయి. ఇంగ్లీష్ పదాలను వాడుతూ ప్రాసతో వార్నింగ్స్ ఇవ్వడం సంభాషణ రచయిత ఎం రత్నం పరిచయం చేసిన స్టైల్. సాయి మాధవ్ బుర్రా కూడా అదే ఫాలో అయ్యారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్. మురళీశర్మ లాంటి రిచ్ క్యాస్టింగ్ తో పాటు రిషి పంజాబీ ఛాయాగ్రహణం, రాజీ పడని మైత్రి సంస్థ నిర్మాణ విలువలు గ్రాండియర్ లుక్ ఇచ్చాయి. పండగ సీజన్ కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి భయం అక్కర్లదు. యావరేజ్ అనిపించుకున్నా బిసి సెంటర్స్ లో ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.
ఒకరకంగా చెప్పాలంటే అయితే లెజెండ్ లేదంటే వీరభద్ర అన్న తరహాలో వీరసింహారెడ్డి మేకింగ్ పాజిటివ్ నెగటివ్ రెండూ కలగలసిన ఫీలింగ్ ఇస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కొంచెం హడావిడి కనిపించింది కానీ ఇంకా ఫైనల్ అవుట్ ఫుట్ మీద తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే చెప్పలేం కానీ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోయిన ఈ వీరసింహారెడ్డి మీద బాలయ్య గట్టి నమ్మకమే చూపిస్తున్నాడు. శృతి హాసన్, హానీ రోస్, అజయ్ ఘోష్, సప్తగిరి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన వీరసింహారెడ్డికి ఒక రోజు ఆలస్యంగా వాల్తేరు వీరయ్య నుంచి పోటీ ఎదురుకానుంది. వారసుడు తెగింపులు ఉన్నాయి కానీ అవి తీవ్రమైన అడ్డంకి కాకపోవచ్చు