మినీ మున్సిపోల్స్.. తెలంగాణలో అత్యంత వివాదం రేపిన ఎన్నికలివి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో అసలు ఎన్నికలు అవసరమా అని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గవర్నర్ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. హైకోర్టుకు కూడా వెళ్లింది. కానీ ఎన్నికలను వాయిదా వేయాలని తాము చెప్పలేమని కోర్టు చెప్పింది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కారు ఎన్నికలకే మొగ్గు చూపింది. ప్రత్యేక పరిస్థితుల్లో […]
తెలంగాణలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుంటే, రాజకీయ నాయకులకు మాత్రం మున్సిపల్ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనంతరం వెలుగులోకి వస్తున్న పొలిటికల్ లీడర్ల పాజిటివ్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా సీఎం కేసీఆర్ కుటుంబంలో పలువురు కరోనా బారిన పడడానికి ఆ ఎన్నికే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో మినీ మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కరోనా కట్టడి చర్యలలో భాగంగా, ఎన్నికల ప్రచారంపై ఎస్ఈసీ […]
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెరాస రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ విధానాల వల్ల దేశంలో ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసే స్థితికి చేరిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఏఏ వంద శాతం తప్పుడు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా గారు […]
అమెరికా నుంచి ఆదిలాబాద్ వరకు ఎన్నికల్లో గెలుపొందేందకు ఒకటే తారక మంత్రం.. స్థానికం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినా.. తెలంగాణలోని కౌన్సిలర్ యాదగిరి అయినా ఈ మంత్రాన్నే జపించి విజయం సాధించారు. ‘‘నేను లోకల్’’ ఫీలింగ్ ఎన్నికల్లో బాగా పని చేస్తుందని తెలంగాణ పురపాలక ఎన్నికల సాక్షిగా మరోమారు రుజువైంది. తెలంగాణ పరపాలక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తాను చాటారు. జాతీయ పార్టీలైన బీజేపీ, ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, ఎంఐఎం లకన్నా ఎక్కువ స్థానాల్లో స్వతంత్రలు […]
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 1579 వార్డులలో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ 537 వార్డులు, భారతీయ జనతా పార్టీ 236 వార్డులు, ఎంఐఎం పార్టీ 69 వార్డులు, స్వతంత్రులు, ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి పోటీచేసిన వారు 306 వార్డుల్లో గెలుపొందారు. దీంతో 109 మున్సిపాలిటీల ఛైర్ పర్సన్ పదవులు అధికార పార్టీకే దక్కనున్నాయి. […]
అక్కడ ఉన్నది పది వార్డులు.. గెలిచింది స్వతంత్రుడితో కలుపుకొని ఏడు పార్టీలు… “అమరచింత” పాత సంస్థానం ..2009 పునః విభజనలో ఈ నియోజకవర్గం రద్దు అయ్యి కొత్తగా దేవరకద్ర ఏర్పడింది. కానీ అమరచింత మండలం మక్తల్ నియోకవర్గంలో కలిసిపోయింది. అప్పట్లో అమరచింత అంటే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నంతగా ఆయన ఆధిపత్యం ఉండేది. కొత్త కోట దయాకర్ రెడ్డి పూర్వికులు అమరచింత సంస్థాన్ దివాన్ గా ఉండేవారు.
తెలంగాణలో అనుకున్నట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార పార్టీపై విపరీత వ్యతిరేకత ఉంటే తప్ప సహజంగానే స్థానిక ఎన్నికల ఫలితాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా చతికిలపడటం. ప్రజల తీర్పు కూడా విచిత్రంగా ఉంది. అసెంబ్లీలో టీఆర్ఎస్కి బ్రహ్మరథం పట్టిన వాళ్లే , లోక్సభలో షాక్ ఇవ్వడమే కాదు, ముఖ్యమంత్రి కూతురిని కూడా ఓడించారు. Read Also: తెలంగాణా మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీల వల్ల ఉపయోగం […]
తెలంగాణ పురపోరులో ఆసక్తికరమైన ఘనట చోటుచేసుకుంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు పైచేయి సాధించారు. పలు చోట్ల అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి రెబల్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ముఖ్యనేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తమ అనుచరులను బరిలోకి దింపారు. ఫలితంగా చాలా చోట్ల టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. Read Also: తెలంగాణా మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు రెబల్ అభ్యర్థులు ఒకటి రెండు చోట్ల గెలవడం సర్వసాధారణం. అయితే నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఇందుకు […]
తెలంగాణ పురపాలక, నగరపాలక ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కారు జోరుతో ఇతర పార్టీలు టీఆర్ఎస్ దరిదాపుల్లోకి కూడా లేకుండా పోతున్నాయి. ఈ రోజు ఉదయం లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వార్డులు, డివిజన్లలో టీఆర్ఎస్ అత్యధిక చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 120 మున్సిపాలిటీలకు గాను టీఆర్ఎస్ 94 మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక 9 కార్పొరేషన్లలో కూడా టీఆర్ఎస్ పార్టీనే ముందంజలో ఉంది. కార్పొరేషన్లలోని 325 డివిజన్లలో ఇప్పటి వరకు […]
తెలంగాణ పట్టణాలలో రాజకీయ పార్టీల భవితవ్యం నేడు తెలనుంది. ఈ నెల 22 జరిగిన పురపాలక, నగరపాలక ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లుకు ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 22న కరీంనగర్ నగరపాలక సంస్థకు మినహా మిగతా పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. నిన్న శుక్రవారం కరీంనగర్లో ఓటింగ్ జరిగింది. ఈ రోజు ఉదయం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించిన ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. […]