Idream media
Idream media
తెలంగాణలో అనుకున్నట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార పార్టీపై విపరీత వ్యతిరేకత ఉంటే తప్ప సహజంగానే స్థానిక ఎన్నికల ఫలితాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా చతికిలపడటం. ప్రజల తీర్పు కూడా విచిత్రంగా ఉంది. అసెంబ్లీలో టీఆర్ఎస్‌కి బ్రహ్మరథం పట్టిన వాళ్లే , లోక్‌సభలో షాక్ ఇవ్వడమే కాదు, ముఖ్యమంత్రి కూతురిని కూడా ఓడించారు.
Read Also: తెలంగాణా మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు
మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీల వల్ల ఉపయోగం లేదని తెలుసు కాబట్టే పట్టించుకోలేదు. రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీల చేతుల్లో పచ్చడిగా మారాయి. కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయం. దేశంలో ఎక్కడా ప్రభావం చూపలేని దుస్థితిలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా లబ్ధి పొందలేకపోయింది. దీనికి కారణం కేసీఆర్, కేటీఆర్ లాంటి నాయకులు లేకపోవడమే. రేవంత్, ఉత్తమ్‌కుమార్‌లు ప్రజల్ని ప్రభావితం చేసే స్థితిలో్ లేరు. కాంగ్రెస్‌లో ఎద్దులున్నాయి కానీ, కాడి మెడకు తగిలించే రైతు లేడు. దానికి తోడు కుమ్ములాటలు ఎక్కువ.
Read Also: పురపోరులో కారు జోరు
ఇక బీజేపీ ఏదో ఆశలు పెట్టుకొంది కానీ , కష్టం. కారణం నడిపే నాయకుడు లేకపోవడం. కేసీఆర్ లాంటి లీడర్ లేకపోవడం వల్ల ఎంతోకొంత బలమున్నా, ప్రయోజనం లేదు. కేసీఆర్ లాంటి లీడర్ ఒక్కరే ఉంటారు. అది కేసీఆరే.
ఆయన కొడుకు కూడా నాయకుడిగా ఎదుగుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకతపైన భారం వేసి రాజకీయాలను నడిపితే ఏమో గుర్రం ఎగరా వచ్చు అనుకోవడమే. అసలే కారు, పైగా కండీషన్‌లో ఉంది. బ్రేక్‌లు వాడాల్సిన అవసరం రావడం లేదు. ఇప్పట్లో కష్టమే. “నడిపించు నా నావ” అని దేవున్ని వేడుకోవాల్సిందే ప్రతిపక్షాలు.