Idream media
Idream media
తెలంగాణ పురపోరులో ఆసక్తికరమైన ఘనట చోటుచేసుకుంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు పైచేయి సాధించారు. పలు చోట్ల అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి రెబల్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ముఖ్యనేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తమ అనుచరులను బరిలోకి దింపారు. ఫలితంగా చాలా చోట్ల టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు.
Read Also: తెలంగాణా మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు
రెబల్ అభ్యర్థులు ఒకటి రెండు చోట్ల గెలవడం సర్వసాధారణం. అయితే నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. 20 వార్డులు ఉన్న కొల్లాపూర్ మున్సిపాలిటీలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు 6 చోట్ల గెలవగా.. ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు మాత్రం 8 చోట్ల గెలవడం విశేషం.టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులందరూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతుతో బరిలోకి దిగారు. వారందరూ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై పోటీ చేశారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 700 వార్డులు, డివిజన్లలో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు.