Idream media
Idream media
తెలంగాణ పురపాలక, నగరపాలక ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కారు జోరుతో ఇతర పార్టీలు టీఆర్‌ఎస్ దరిదాపుల్లోకి కూడా లేకుండా పోతున్నాయి. ఈ రోజు ఉదయం లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వార్డులు, డివిజన్లలో టీఆర్‌ఎస్ అత్యధిక చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
120 మున్సిపాలిటీలకు గాను టీఆర్‌ఎస్ 94 మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక 9 కార్పొరేషన్లలో కూడా టీఆర్‌ఎస్ పార్టీనే ముందంజలో ఉంది. కార్పొరేషన్లలోని 325 డివిజన్లలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ 58 డివిజన్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీజేపీ 17 డివిజన్లును గెలిచుకున్నాయి.
Read Also: ఎవరిది పైచేయి.. నేడు తెలంగాణ పుర ఫలితాలు..
సాయంత్రానికి ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే ఫలితాల సరళి కనపడుతోంది. సోమవారం మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ల పదవులకు ఎన్నిక జరగనుంది.