అవసరం ఉన్నప్పుడు మాత్రమే నాయకులను గుర్తు చేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ అదే బాట పట్టారు. వివిధ కారణాల రీత్యా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న నాయకులను ఇళ్లకు వెళ్లి మరీ పలకరిస్తూ తిరుపతి ఉప ఎన్నికల్లో సానుభూతి పాచిక వేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరులో టీడీపీ నేతల ప్రతి ఇంటికి వెళ్లి నాయకులను చంద్రబాబు స్వయంగా పలకరించడం ఆయనకు సానుకూలతను తీసుకు రాకపోగా, ఆయన నైజం మీద పార్టీ శ్రేణులే ఆశ్చర్యం వ్యక్త […]
సరిగ్గా మూడు నెలల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసానికే పరిమితం అయ్యారు. కరోనా కారణంగా దాదాపు ఏడాది వరకు ఆయన తన పార్టీని జూమ్ యాప్ ద్వారా నడిపించారు. కానీ ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చారు. దానికి కారణం ఏమిటి..? వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే చంద్రబాబు బయటకు వస్తున్నారా..? ఇంతకూ చంద్రబాబు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకున్నారు..? ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు..? అనే చర్చ కొనసాగుతోంది. తిరుపతి […]
కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు నాకు అభ్యంతరం లేదు. హైకోర్టు రాయలసీమలో పెట్టాలని నేనూ చెప్పా. రాయలసీమ అభివృద్ధి చెందాలి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్లే. విశాఖ ప్రజలు వైసీపీని ఓడించాలి. అమరావతి నా కోసం కాదు మీ కోసం నిర్మించాలని మొదలు పెట్టాను. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుడుపల్లె, కుప్పంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తల వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తర్వాత తేరుకుని ‘‘పొరపాటు జరిగింది.. మీరు ఎన్నో త్యాగాలు చేశారు.. మీకోసం ఆలోచించి ఉంటే బాగుండేది.. మిమ్మల్ని విస్మరించా. ఇకపై మీ కోసం 25% సమయం కేటాయిస్తా.. మీరంతా చెప్పినట్లు వింటా..’’ అంటూ బుజ్జగిస్తూ ముందుకు సాగారు. పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా చేశారని, నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. […]
ఈరోజు ఓవార్త చూస్తే ఆశ్చర్యం వేసింది. గత ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం..అన్నది ఆ వార్త సారాంశం.. అదేంటీ వైఎస్ ప్రభుత్వం ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు గుండెలు పగిలిపోయి..విగ్రహాల విధ్వంసాన్ని ఆపాలంటూ ఆందోళన బాట పట్టాడు కదా? మరి తెలుగు దేశం ప్రభుత్వ హాయాంలో గుడులు కూల్చడం ఏంటీ? ఇలాంటి వార్తలు వరాయడం ఏంటి? పాపం బాబు అనిపిస్తుంది కదా? పైగై జగన్ క్రిస్టియన్.. ఊరూరా చర్చిలు […]
వయసు పెరిగే కొద్దీ మనిషి ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుందంటారు. వృద్ధాప్యంలో ఉన్న వారు అయితే కుటుంబ సభ్యులతోపాటు చుట్టూ ఉన్నవారు తన నుంచి జీవితపు విలువలు నేర్చుకునేలా జీవిస్తుంటారు. అయితే రాజకీయాల్లో ఉంటే అలా జీవించకూడదని, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనేలా ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన వ్యవహార శైలి ద్వారా నిరూపిస్తున్నారు. రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలు వరకూ అందరూ చేసేవే. కానీ 70 ఏళ్ల వయస్సులోని చంద్రబాబు ఆడే అబద్ధాలకు హద్దేలేకుండా […]
కరోనా కారణంగా హైదరాబాద్లోని ఇంటికి, అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయంలో జరిగిన ఘటనను పరిశీలించేందుకంటూ ఆలయ పరిరక్షణ పేరుతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయనగరం వచ్చారు. ఇటీవల అంతర్వేదీ సహా పలు ప్రాంతాలలో దేవతా విగ్రహాల ధ్వంసం, దాడుల ఘటనలు జరిగాయి. అయితే ఆయా సందర్భాలలో రాని చంద్రబాబు ఇప్పుడు రావడం వెనుక కారణం […]
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లా రామతీర్థం రానున్నారు . ఇటీవల గ్రామంలోని బోడికొండ పై ఉన్న కోదండ రామాలయంలోని శ్రీ రాముని విగ్రహం ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఆ రోజు రాముని శిరస్సును ఖండించిన దుండగులు ఆ శిరస్సుని మాయం చేశారు . దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రాంతీయ సంయుక్త సంచాలకులు భ్రమరాంబ సారధ్యంలో విచారణకు ఆదేశించడం, ఆ వెనువెంటనే వివిధ శాఖల వారు ఘటనాస్థలికి చేరి అన్వేషణ […]
ప్రచారం.. ఈ పదం తెలుగుదేశం పార్టీకి గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకుగానీ నచ్చినంతగా మరెవరికీ నచ్చదంటే అతిశయోక్తి కాదేమోననిపిస్తుంది. చేసినదానికి, చెయ్యనిదానికీ, తరువాత అధికారంలోకొచ్చి వాళ్ళు చేసిన దానికి కూడా తానే ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు, ఆయన పార్టీని మించినవారు లేరని ప్రత్యర్ధులు కూడా ఘాటు విమర్శలే చేస్తుంటారు. అయితే వీటినే మాత్రం పట్టించుకోకుండా తన ప్రచారమేమో తాను చేసుకుంటూ పోతుంటారు నారా వారు. మొట్టమొదటి సారి సీయం అయినప్పుడు ఇదేదో కొత్తగా అన్పించి, జనాలు […]
40 ఏళ్ల పైబడిన రాజకీయ అనుభవం తనదీ అంటూ చెప్పుకునే చంద్రబాబు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా.. దేశంలో అందరికన్నా తానే సీనియర్ నని చెప్పుకునే మాజీ సీఎం దానికి అనుగుణంగా సాగుతున్నారా.. జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పానని భుజాలు చరచుకునే సీబీఎన్ చేష్టలు అదే స్థాయిలో ఉన్నాయా.. ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పలు సందేహాలు పెరుగుతున్నాయి. ఏపీకి అత్యంత సుదీర్ఘకాలం సీఎంగా చేసిన ఆయన ప్రతిపక్షం హోదాలో ఎందుకు తేలిపోతున్నారు.. గతంలో విపక్షంలో ఉన్నప్పటికీ ఈసారి మాత్రం […]