iDreamPost
android-app
ios-app

అవసరానికి మాత్రమే నాయకులా బాబు?

అవసరానికి మాత్రమే నాయకులా బాబు?

అవసరం ఉన్నప్పుడు మాత్రమే నాయకులను గుర్తు చేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ అదే బాట పట్టారు. వివిధ కారణాల రీత్యా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న నాయకులను ఇళ్లకు వెళ్లి మరీ పలకరిస్తూ తిరుపతి ఉప ఎన్నికల్లో సానుభూతి పాచిక వేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరులో టీడీపీ నేతల ప్రతి ఇంటికి వెళ్లి నాయకులను చంద్రబాబు స్వయంగా పలకరించడం ఆయనకు సానుకూలతను తీసుకు రాకపోగా, ఆయన నైజం మీద పార్టీ శ్రేణులే ఆశ్చర్యం వ్యక్త పరిచే లా చేసింది.

2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలిచిన మంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ప్రజారాజ్యం విలీనం తర్వాత టిడిపిలో చేరారు. పార్టీ కోసం గట్టిగానే తిరిగారు. 2014లో చంద్రబాబు టిడిపి టికెట్ ను శ్రీధర్ కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, శ్రీధర్ కృష్ణారెడ్డి మాత్రం వైస్సార్సీపీ తరపున పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. దీని తర్వాత శ్రీధర్ కృష్ణారెడ్డి క్రమంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా అవుతూ వచ్చారు.

నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణకు చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు నారాయణ నెల్లూరు నగర టికెట్ ను ముందుగానే రిజర్వ్ చేసుకోవడంతో శ్రీధర్ కృష్ణారెడ్డి టిడిపిలో ఉండేందుకు ఇష్టపడలేదు. అయితే మరో పార్టీలోకి వెళ్లేందుకు ఆయనకు ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు పూర్తి దూరంగా జరిగారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితీత్తుల ఈ సమస్యతో బాధపడుతున్నారు. 2019 ఎన్నికల నుంచి ఆయన అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న పట్టించుకోని టీడీపీ అధినేత ఇప్పటికి ఇప్పుడు ఉన్నట్టుండి ప్రేమ కురిపించడం వెనుక ఉన్న ఆంతర్యం తెలుగు తమ్ముళ్లకు సైతం అర్థం అవుతోంది.

Also Read : ఓట్ల కోసం చంద్రన్న పాట్లు

2014, 2019లో వరుసగా నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి గత కొంతకాలంగా ఆరోగ్యం సమస్యలతో బాధపడుతూ నెల్లూరు లోనే ఉంటున్నారు. ఇటీవల ఆయనను బుజ్జగించేందుకు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జి పదవిని చంద్రబాబు ఇచ్చిన , దానిపై కూడా ఆయన ఆసక్తి చూపలేదు. ఇప్పటి నుంచి ఒక నియోజకవర్గ స్థాయి సమావేశం, సదస్సు సైతం నిర్వహించలేదు. కనీసం ఇంటి నుంచి బయటకు రావడం లేదు. రెండుసార్లు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరం అవుతూ, మరోపక్క ఆయన పార్టీ మారతారు అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనను బుజ్జగించేందుకు చంద్రబాబు నెల్లూరు లోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి సర్ది చెప్పడం విశేషం. ఖచ్చితంగా ఈసారి న్యాయం జరుగుతుందని, పార్టీ కీలక సమయంలో వెన్నంటే ఉండాలని కోరినట్లు తెలిసింది.

నాయకులను చంద్రబాబు స్వయంగా వెళ్లి కలవడం, వారి యోగక్షేమాలను కనుక్కోవడం సరిగ్గా ఎన్నికల వేళ లోనే పార్టీ అధినేతకు గుర్తుకు వస్తోంది అన్న చర్చ తెలుగు తమ్ముళ్ల లోనే జరుగుతుంది. ఇప్పటివరకు నెల్లూరు జిల్లా రాజకీయాలన్నీ తెదేపా తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆర్థిక కార్యకలాపాలను నారాయణకు చక్కబెట్టారు. చంద్రబాబు వారిద్దరి మీదనే మొత్తం వదిలేసారు. సరిగ్గా ఎన్నికల వేళ పార్టీ తీరు మీద ఆగ్రహంతో ఉన్న వారిని కలుసుకోవడం వల్ల చంద్రబాబు తీరు మీద ప్రతికూల తప్ప అనుకూలత రావడం లేదు. అంతేకాదు చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి నాయకులను బుజ్జగిస్తున్న వారు అధినేత మాటకు ససేమిరా అనడం మరో విశేషం.

Also Read : చంద్రబాబుతో ఉన్న నేతలకు కరోనా.. టీడీపీ అధినేతకు ప్రమాదం లేనట్లేనా..?