iDreamPost
android-app
ios-app

హన్నన్నా..చంద్రన్నా !

హన్నన్నా..చంద్రన్నా !

ఈరోజు ఓవార్త చూస్తే ఆశ్చర్యం వేసింది. గత ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం..అన్నది ఆ వార్త సారాంశం.. అదేంటీ వైఎస్ ప్రభుత్వం ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు గుండెలు పగిలిపోయి..విగ్రహాల విధ్వంసాన్ని ఆపాలంటూ ఆందోళన బాట పట్టాడు కదా? మరి తెలుగు దేశం ప్రభుత్వ హాయాంలో గుడులు కూల్చడం ఏంటీ? ఇలాంటి వార్తలు వరాయడం ఏంటి? పాపం బాబు అనిపిస్తుంది కదా? పైగై జగన్ క్రిస్టియన్.. ఊరూరా చర్చిలు నిర్మిస్తున్నారు..అయినా ఆలయాలు కూల్చే అధికారం ఆయనకు ఎవరిచ్చారు..అని పాపాం చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.. అలాంటి సమయంలో ఇంలాటి వార్తలు నిజంగా ఆశ్చర్యం కల్గించవంటారా చెప్పండి..?

ఇక అసలు విషయానికి వస్తే …. కృష్ణా పుష్కరాల సమయంలో టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను తొలి,మలి దశల్లో తాము పునర్నిర్మిస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. చంద్రబాబు పాలనలో విజయవాడలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. పుష్కరాల సమయంలో ప్రకాశం బ్యారేజి వద్ద సుమారు 21 ఆలయాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. అయితే తొలి విడతగా వాటిలో 8 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతలకు గురైన ఆలయాలను కూడా నిర్మించే ఆలోచనలో ఏపీ సర్కారు ఉంది. ఈ మేరకు మంత్రి వెల్లడించారు. కాగా, ఈ నెల 8న దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. బెజవాడ కనకదుర్గ గుడి అభివృద్ధి పనులకు సర్కారు రూ.70 కోట్లు ఖర్చు చేయనుంది.

అదండీ సంగతి.. పుష్కారాల పేరుతో పదులు సంఖ్యంలో పొట్టన పెట్టుకున్న చంద్రబాబు.. ఆ పుష్కరాలు ఏర్పాట్లలో భాగంగా గుడులను కూల్చేశారు.. ఇప్పుడేమో.. అమ్మో గుడులు,అయ్యో గుడులు..క్రిస్టియన్ అయినందువల్లో జగన్ వాటి విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారని తెగ గుండలు బాదుకుంటున్నారు.. కానీ మతం ఏదైనా మరో మతం దేవున్ని కూల్చమని చెప్పుదు.. కాకపోతే ఎవరో దుండగులు కావాలని, రాష్ట్రంలో ఇరు వర్గాల మధ్యం కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారు.. వైసీపీ నేతలు ఆరోపించినట్లు ఏపీలో విగ్రహాల విధ్వంస వెనుక రాజకీయ కుట్ర ఉన్నా ఉండొచ్చు…అయితే బీజేపీ ఎలాగు హిందుత్వాన్ని భుజాన మోస్తుంది. అది గుళ్లు గోపురాల విషయంలో రాద్దాంతం చేసి లబ్ది పొందడం అలవాటే..కాని చంద్రబాబు మాత్రం పక్కాగా విధ్వంసాన్ని రాజకీయం చేసి..ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసి,లబ్ది పొందాలనిచూస్తున్నారు.. లేకుంటే తాను పదుల సంఖ్యంలో గుళ్లు కూల్చిన బాబు..ఇలా రోడ్డెక్కి గుండెలు బాదుకోవడం ఏంటి ..విడ్డూరం కాకపోతే!

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş