రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు సంచనల ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధించింది. ఈ చట్టాన్ని ప్రస్తుతానికి నిలుపదల చేస్తున్నట్లు బుధవారం నాటి తీర్పులో వెల్లడించింది. రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చని సూచించింది. అంతేకాదు, రాజద్రోహం చట్టం కింద కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని తేల్చేసింది. రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలన్న సుప్రీం కోర్టు, సెక్షన్ 124A కింద నమోదైన కేసులన్నింటినీ తిరిగి విచారించాలని […]
కరోనాకి విరుగుడుగా అనేక దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టి వారి ప్రజలందరూ తప్పనిసరిగా ఆ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించాయి. మన దేశంలో కూడా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు డాక్టర్లు కూడా చెప్పారు. ఇప్పటికే చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా వేయించుకోవాలని కేంద్రం ప్రజలని కోరుతోంది. దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగంగా చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలో […]
వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు అనుమానించినట్లుగానే జరుగుతోంది. మళ్లీ ఆ చట్టాలను తీసుకువచ్చే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. రైతులు నిరాటంకంగా ఏడాదిపాటు ఆందోళనలు చేసిన తర్వాత సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత నవంబర్లో ప్రకటించినా… ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తంతు పూర్తయిన తర్వాత మళ్లీ సాగు చట్టాలను తెచ్చే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వాటిని నిజం చేసేలా […]
రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ రాజుకు ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సుప్రిం కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రిం ధర్మాసనం.. కొద్దిసేపటి క్రితం తీర్పును వెల్లడించింది. విచారణ అధికారి పిలిచిన వెంటనే విచారణకు హాజరుకావాలని, అందుకు అధికారులు 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని షరతు విధించింది. […]
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. దాన్ని అరికట్టడంలోనూ, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల ధర లు, ఆక్సిజన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అస్తవ్యస్త విధానాలను సరిచేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నడుం బిగించింది. కరోనా కట్టడి చర్యలపై విచారణ జరుపుతున్న కేంద్రం ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్ర దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించిన తర్వాత.. సుప్రిం ఈ ప్రశ్నలు సంధించడం సదరు అఫిడవిట్లో సమగ్ర సమాచారం లేదన్న విషయాన్ని తెలియజేస్తోంది. కరోనా […]
కరోనా.. ఓ ప్రపంచ మహమ్మారి. భూమిపై బతికున్న ఏ ఒక్కరూ ఇప్పటిదాకా చూడని మహా విపత్తు. 31 లక్షల మందిని బలి తీసుకున్న రాకాసి. రోజూ వేల మందిని చంపుతూనే ఉంది. ఇండియాలో అయితే.. ఎక్కడా లేనంతగా రికార్డు స్థాయిలో వైరస్ బారిన పడుతున్నారు. రోజూ 3.5 లక్షల కేసులు, రెండున్నర వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పుడున్నది నేషనల్ ఎమర్జెన్సీ లాంటిదే. కానీ పరిస్థితులు రోజురోజుకూ చేయి దాటిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉంది. ఏమీ […]
చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ వ్యవహారంలో గతంలో నానాయాగి చేసి, ఏదేదో చూపి, ఇంకెవరి మీదో బురద చల్లాలని చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. తాజాగా జడ్జి రామకృష్ణ తో జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ లో దురుద్దేశ పూర్వకంగా కుట్రకోణం తో మాట్లాడినట్లు గతంలో రాష్ట్ర హైకోర్టు విచారణకు ఆదేశాలను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ అంత తీవ్రత ఏమీ లేదని సుప్రీం అభిప్రాయపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ జడ్జి రామకృష్ణ […]
అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై వివిధ దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏప్రిల్ వరకూ అమలులో కొనసాగనున్నాయి. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేలను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రిం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల 7వ తేదీకి వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ ఉన్నందున ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై మరో రోజు వాదనలు వింటామని జస్టిస్ అశోక్ […]
అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్దకు చేరింది. అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం సుప్రిం కోర్టు క్లారిటీ ఇవ్వబోతోంది. అమరావతి భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు […]
జల ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేసిందో చెప్పడానికి… సోమవారం సుప్రీంకోర్టు పురుషోత్తమపట్నం విషయములు ఇచ్చిన తీర్పే నిదర్శనం. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం… టెండర్లను పిలిచి నానా హడావుడి చేసి వేల కోట్ల రూపాయలకు గండి కొట్టి జేబులు నింపుకోవాలని చూసింది.. ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనం లేని పురుషోత్తమపట్నం ప్రాజెక్టును బూచిగా చూపి… తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకోవడానికి చూసారు […]