iDreamPost
android-app
ios-app

నా మాటలని వక్రీకరించారు.. బేషరతుగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా: CM రేవంత్

  • Published Aug 30, 2024 | 12:46 PM Updated Updated Aug 30, 2024 | 12:46 PM

CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలుకు వెళ్లారు. మొన్న ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది.

CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలుకు వెళ్లారు. మొన్న ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది.

  • Published Aug 30, 2024 | 12:46 PMUpdated Aug 30, 2024 | 12:46 PM
నా మాటలని వక్రీకరించారు.. బేషరతుగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా: CM రేవంత్

తెలంగాణలో గత ఏడాది చివర్లో శాసన సభ ఎన్నికలు జరిగాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు నెరవేరుస్తున్నారు. ఇటీవల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. త్వరలో నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  హైదరాబాద్ లో అక్రమ కట్టడాల ప్రక్షాళనకు చేసే పనిలో ‘హైడ్రా’ను రంగంలోకి దింపారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  సుప్రీం కోర్టు విషయంలో తాను చేసిన వ్యాఖ్యల గురించి స్పందించారు. వివరాల్లోకి వెళితే…

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పలుమార్లు ఆమె బెయిల్ కి అప్లై చేసుకున్నారు. మొత్తానికి  ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  కవితకు బెయిల్ రావడంలపై పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది.  సుప్రీం కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్ రెడ్డి అగౌరవంగా కామెంట్స్ చేశారని ఆగస్టు 29న కొన్ని పత్రికలు కథనాలు వచ్చాయి.

తనపై వచ్చిన కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు.  ‘గౌరవనీయ న్యాయస్థానం న్యాయపరమైన విజ్ఞతను తాను ప్రశ్నిస్తున్నాననే అభిప్రాయం తనపై కలిగేలా వార్తలు వక్రీకరించి రాశారు. న్యాయ వ్యవస్థను నేను ఎంతో విశ్వసిస్తానని మరోసారి గట్టిగా చెబుతున్నారు. మీడియాలో వచ్చిన కథనాల పట్ల బేషరుతుగా విచారణ వ్యక్తం చేస్తున్నా. నాకు సంబంధం లేని వ్యాఖ్యలను ఆపాదించారు. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల అత్యున్నత గౌరవం ఉంది. భారత రాజ్యాంగాన్ని ధృంగా నమ్ముతాను.. న్యాయ వ్యవస్థను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాను’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.