Dharani
NEET Results 2024: ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక వివాదాలు రాజుకుంటున్నాయి. క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందంటూ వాదనలు విరిపిస్తున్నాయి. ఇప్పుడీ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ఆ వివరాలు..
NEET Results 2024: ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక వివాదాలు రాజుకుంటున్నాయి. క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందంటూ వాదనలు విరిపిస్తున్నాయి. ఇప్పుడీ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ఆ వివరాలు..
Dharani
మెడిసిన్ చేద్దామనుకునే విద్యార్థులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ పరీక్ష నిర్వహించేది. అయితే ఆ తర్వాత మెడికల్ ప్రవేశాల కోసం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈక్రమంలో తాజాగా నీట్ 2024 ఫలితాలు వెల్లడించారు. ఇక ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన వారిలో సుమారు 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. అయితే వారిలో 67 మంది అభ్యర్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అయితే నీట్ పరీక్షలో ఇంత మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడం సంచలనంగా మారడమే కాక.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 720 మార్కుల పేపర్‌కు కొంతమంది పిల్లలు 718, 719 మార్కులు కూడా సాధించారు. దీనిపై నిపుణులు అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది నీట్-యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. నీట్ పరీక్షను 720 మార్కులకు నిర్వహించారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఇవ్వబడ్డాయి. సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇస్తే, 720 మార్కులు వస్తాయి. కనీసం ఒక ప్రశ్నను వదిలివేసినా ఆ ప్రశ్నకు వర్తించే 4 మార్కులు కోల్పోతారు. లేదా ఒక్క ప్రశ్న తప్పుగా రాస్తే.. దానికి మొత్తంగా 5 మార్కులు మైనస్ అయ్యి 715 మార్కులు రావాలి. కానీ చాలా మంది పిల్లలకు 718, 719 మార్కులు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం అయ్యిందని నిపుణులతో పాటు పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ వివాదంపై ఎన్‌టీఎల్ స్పందిస్తూ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. చాలా మంది పిల్లలకు 718, 719 మార్కులుపై ఎన్‌టీఎల్ మాట్లాడుతూ.. “ఈ పరీక్ష నిర్వహించినప్పుడు, కొంతమంది పిల్లలకు పరీక్ష పేపర్ ఆలస్యంగా వచ్చాయి. దీని వల్ల గ్రేస్ మార్కులు ఇచ్చాం. గ్రేస్ మార్కుల వల్ల మాత్రమే ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా చోట్ల పరీక్షలో సమయం వృధా కావడం, కొన్ని చోట్ల పరీక్ష పేపర్లు 20 నిమిషాల వరకు ఆలస్యంగా రావడంతో పిల్లలు ఎన్‌టీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా పేపర్ ఆలస్యంగా వచ్చిన గ్రేస్ మార్కులు కలిపారు. అందుకే కొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు వేయాల్సి వచ్చింది. అలానే నీట్ పరీక్షలో కెమిస్ట్రీలో ఒక్క ప్రశ్నపై వివాదం ఉంది. ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సమాధానాలు సరైనవే. దీనికి ఎన్‌సీఆర్‌టీ పాత పుస్తకంలో ఇచ్చిన ఒక సమాధానం సరైందిగా చూపగా.. కొత్త పుస్తకంలో మరొక సమాధానం సరైనదిగా చూపబడింది. దీంతో రెండు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు వచ్చాయి. అందువల్లే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పూర్తి మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు ” అని చెప్పుకొచ్చింది.
ఈ వివాదం నేపథ్యంలో.. 2024 నీట్-యూజీ పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మే 5న నిర్వహించే పరీక్షను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీక్ అయ్యిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ని ఉల్లంఘించడమేనని, ఇది న్యాయమైన పద్ధతిలో పరీక్షకు హాజరైన కొంతమంది అభ్యర్థులకు అన్యాయమైన ప్రయోజనం చేకూర్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణమే దీనిపై స్పందించి.. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
#NEET fraud ⚠️
How anyone can score 718 & 719 marks out of 720 if marking schemes are not changed.
This can be the biggest scam by NTA.
If you have doubt, go to website and enter his roll number.
Please clarify this scam or cancel this NEET 2024 Exam asap.@NTA_Exams pic.twitter.com/YVJcNfIdXG
— ADITYA NARAYAN (@narayanaditya45) June 4, 2024