Arjun Suravaram
NEET UG 2024: యూజీసీ నెట్-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఇష్యూపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం సుప్రింకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది.
NEET UG 2024: యూజీసీ నెట్-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఇష్యూపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం సుప్రింకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది.
Arjun Suravaram
దేశ వ్యాప్తంగా నీట్-యూజీ పేపర్ లీకేజ్ వ్యవహరం సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ పరీక్ష అంశంపై పార్లమెంట్ లో అధికార, విపక్షాల మధ్య పెద్ద రగడనే జరుగుతుంది. అంతేకాక నీట్-2024 పరీక్ష అంశంపై సుప్రీం కోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసింది. దీంతో తిరిగి ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఈ చర్య నిజాయితీగా పరీక్షలు రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అందులో స్పష్టం చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూజీసీ నెట్-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. దీంతో ఇటీవలే ఈ ఎగ్జామ్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలానే యూజీసీ నెట్-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. అలానే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనలో కొందరి పోలీసులు అరెస్టు చేశారు. అలానే ఈ కేసుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇది ఇలా ఉంటే..గతంలోనే నీట్ పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి.. సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈక్రమంలోనే తాజాగా పరీక్ష రద్దు చేయడం సహేతుకం కాదు అంటూ..కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పారదర్శకంగానే కాంపిటీటివ్ పరీక్షలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు అందులో పేర్కొంది. నీట్-2024 క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు కేంద్రం పేర్కొంది. నీట్ అక్రమాలపై సీబీఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించామని తెలిపింది. భారీగా అక్రమాలు, అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. అలాంటప్పుడు మొత్తం పరీక్షను, ఇప్పటికే విడుదలైన ఫలితాలను రద్దు చేయడం సరైనది కాదని కేంద్రం సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. నీట్‌ను రద్దు చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన లక్షల మంది నష్టపోతారని తెలిపింది.
దేశంలోని వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్-యూజీ 2024 పరీక్షను నిర్వహించారు. అయితే అందులో అవకతవకలు, లీకేజీ ఆరోపణల పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం వంటి దాదాపు 26 పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. వీటన్నింటిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జులై 8న విచారించనుంది. ఇటీవలే ఈ ఇష్యూపై సుప్రీంకోర్టు సమాధానం కోరుతూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మరోవైపు, నీట్ 2004 పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ గురువారం 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జులై 8న సీజేఐ ధర్మాసనం విచారణ జరపనుంది.