iDreamPost

Superme Court: అవివాహిత పిటిషన్…గర్భంలోని పిండంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

కుటుంబ వ్యవహాారాలకు సంబంధించి, భార్యాభర్తల బంధం, వివాహేతర సంబంధం వంటి విషయాలపై అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలాంటి తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నాయి.

కుటుంబ వ్యవహాారాలకు సంబంధించి, భార్యాభర్తల బంధం, వివాహేతర సంబంధం వంటి విషయాలపై అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలాంటి తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నాయి.

Superme Court: అవివాహిత పిటిషన్…గర్భంలోని పిండంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

ఈ మధ్యకాలంలో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఫలానే కేసు అని కూకుండా దాదాపు అన్ని కేసుల్లో ఆశ్చర్యాన్ని కలిగించే తీర్పులు ఇస్తున్నాయి. ముఖ్యగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల బంధం, వివాహేతర సంబంధం వంటి విషయాలపై అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలాంటి తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నారు. అలానే తాజాగా సుప్రీం కోర్టు న్యాయస్థానం గర్భంలోని పిండం విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఫ్యామిలీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు.. ఇలా కోర్టు ఏదైనా ఇటీవల కాలంలో మాత్రం సంచలనమైన తీర్పులు  ఇస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధం, శృ0గారానికి సంబంధించిన విషయాల్లో పలు హైకోర్టులు కీలక తీర్పును ఇచ్చాయి. ఇటీవలే ఓ హైకోర్టు 18 ఏళ్లు దాటిన వారి శృ0గారం చేసుకునేందుకు అభ్యంతరం లేదంటూ కీలక తీర్పు ఇచ్చింది. అలానే భరణం విషయంలో ఒకసారి భర్తకు అనుకూలంగా, మరోసారి భార్యకు అనుకూలంగా తీర్పులు వెల్లడిస్తున్నాయి. తాజాగా గర్భంలోని పిండానికి  కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలని 20 ఏళ్ల ఓ అవివాహిత  సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ని స్వీకరించేందుకు బుధవారం సుప్రీం కోర్టు నిరాకరించింది.

తొలుత మే 3న ఆమె గర్భాన్ని తొలగించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గర్భంలోని పిండం విషయంలో పై వ్యాఖ్యలు చేసింది. మేము చట్టానికి విరుద్ధంగా ఏ ఉత్తర్వులను జారీ చేయలేము అని  న్యాయస్థానం స్పష్టం చేసింది. కడుపులోని బిడ్డకు కూడా జీవించే హక్కు ఉంటుందని, దాని గురించి మీరు ఏం అంటారు..? అని వివాహిత తరపు లాయర్ ను కోర్టు ప్రశ్నించింది.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. కేవలం తల్లి గురించి మాత్రమే మాట్లాడుతుందని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఆమె గర్భం దాల్చి 7 నెలలకు పైగా అయిందని, ఇప్పుడు తీసివేయించుకోవడం ఏంటని ప్రశ్నించింది. అలానే ఇలా చేస్తే.. భవిష్యత్ లో  పిల్లల మనుగడ హక్కు పరిస్థితి ఏంటి..? అని బెంచ్ ప్రశ్నించింది. గర్భంలోని పిండం.. బిడ్డగా ప్రసవించే వరకు అది తల్లి హక్కు అని న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. మరీ..సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి