SNP
D Nageshwar Reddy, National Task Force, Supreme Court, Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనతో సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. అందులో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
D Nageshwar Reddy, National Task Force, Supreme Court, Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనతో సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. అందులో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
‘కోల్‌కతా డాక్టర్ హత్యాచార’ ఘటన దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తోంది. దేశవ్యాప్తంగా డాక్టర్లు, సామాన్యులు, సెలబ్రెటీలు అంతా.. రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని, దేశంలో వైద్యులకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదికారం కోల్‌కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. మంగళవారం విచారణ జరిపి.. ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతా కోసం ఒక ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు ఈ ఎన్‌టీఎఫ్ కమిటీని నియమించింది.
మొత్తం 9 మందితో కూడిన కమిటీని వేస్తూ.. ఒక పటిష్టమైన ప్లాన్‌ను రూపొందిచాలని కోరింది. కమిటీలో.. ‘ఆర్తి సరిన్- డీజీ మెడికల్ సర్వీసెస్(నేవీ), డీ నాగేశ్వర్ రెడ్డి, ఎం శ్రీనివాస్, ప్రతిమా మూర్తి, గోవర్ధన్ డీ పూరి, సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా, పల్లవి సప్లే, పద్మ శ్రీవాస్తవ’ ఉన్నారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి, హత్య చేయడాన్ని సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో భద్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, బెంగాల్ పోలీస్ వ్యవస్థను నిలదీసింది. ఈ ఒక్క కేసు గురించే కాకుండా.. దేశం మొత్తం వైద్యులకు పటిష్ట భద్రత కల్పించేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో ఒక ప్రముఖ తెలుగు వ్యక్తికి చోటు కల్పించింది సుప్రీం కోర్టు. ఆయన పేరు డీ.నాగేశ్వర్ రెడ్డి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతా డాక్టర్ కేసులోని కీలక పరిణామంలో తన వంతు పాత్ర పోషించిబోతున్న నాగేశ్వర్‌రెడ్డి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం..
డాక్టర్ డీ.నాగేశ్వర్ రెడ్డి.. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్(జీర్ణాశయ పేగుల వైద్య నిపుణులు). అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్ అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి ఛైర్మన్. నాగేశ్వర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీజీఏ పూర్తి చేశారు. ఛండీగఢ్‌లో డీఎం చేశారు. ఆ తర్వాత.. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పనిచేశారు. నాగేశ్వర్ రెడ్డిని 2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అలాగే 2009లో మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డ్, 2013లో మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, 2022లో అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్ అసోసియేషన్ పురస్కారం అందుకున్నారు. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణ కోసం ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో నాగేశ్వర్ రెడ్డి భాగం అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s the composition of the National Task Force formed by the SC to look into the safety of medical professionals in hospitals across India. pic.twitter.com/WPQq1Fg5Hf
— The Leaflet (@TheLeaflet_in) August 20, 2024