iDreamPost
android-app
ios-app

మహిళలకు తప్పనిసరి పీరియడ్ హాలిడేపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Supreme Court On Period Holidays: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం.. మహిళలకు తప్పనిసరిగా నెలసరి సెలవులు ఇవ్వాలి అంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court On Period Holidays: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం.. మహిళలకు తప్పనిసరిగా నెలసరి సెలవులు ఇవ్వాలి అంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

మహిళలకు తప్పనిసరి పీరియడ్ హాలిడేపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

మహిళలకు తప్పనిసరిగా పీరియడ్ హాలీడే ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు తప్పనిసరిగా నెలసరి సెలవులు మంజూరు చేయడం చాలా మంచి విషయం అని వ్యాఖ్యానించింది. కానీ, ఆ నిర్ణయం మహిళల భవిష్యత్తుకు అడ్డంకిగా కూడా మారే ప్రమాదం ఉందని అభిప్రాయం పడింది. అయితే ఈ సెలవులు ఇవ్వాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని.. దానిలో తాము జోక్యం చేసుకోలేము అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం మన దేశంలో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే పీరియడ్ హాలిడేని అమలు చేస్తున్నాయి. అయితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ నెలసరి సెలవులను తప్పనిసరి చేసేలా తీర్పు ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి బస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్ ని కొట్టేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు ఇవ్వడం అనేది మహిళలు మరింత ఉత్సాహంతో పని చేసేందుకు కచ్చితంగా దోహదపడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ, తప్పనిసరిగా మహిళలలు సెలవులు ఇవ్వాలి అంటూ యాజమాన్యాలను ఒత్తిడి చేస్తే మాత్రం అది వారి భవిష్యత్తు మీద ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళలకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది.

మహిళల ప్రయోజనాల కోసం మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు వారికి అడ్డంకిగా మాత్రం మారకూడదు అంటూ తెలిపారు. అలా అవ్వాలి అని కూడా తాము కోరుకోవడం లేదు అంటూ స్పష్టం చేశారు. అలాగే ఇది విధాన పరమైన నిర్ణయమని తెలిపారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేము అంటూ స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరిపి ఫ్రేమ్ వర్క్ ను తయారు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అలాగే పిటిషనర్ కు ఈ అంశాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ప్రస్తుతం కేవలం బిహార్, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఈ నెలసరి సెలవులు అమలులో ఉన్నాయి. బిహార్ ప్రభుత్వమైతే.. 1992 నుంచే మహిళలకు రెండ్రోజుల పీరియడ్ హాలిడే ఇస్తోంది. ఇంక కేరళ ప్రభుత్వం ఇటీవలే విద్యార్థినులకు మూడ్రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఫిబ్రవరిలో కూడా ఇదే అంశంపై ఒక పిటిషన్ దాఖలు కాగా సుప్రీంకోర్టు విచారణ జరిపేందుకు నిరాకరించింది.