నిండా మునుగుతున్న శివసేన, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జంట వ్యూహాన్ని అమలు చేస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కి వస్తే కూటమి ప్రభుత్వం MVAని విడిచిపెడతామని ప్రతిపాదించింది. ఒకవేళ తిరుగుబాటు కనుక కొనసాగితే, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తామని బెదిరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ మాట వింటాం, లేదంటే వేటు వేస్తాం. ఇదీ శివసేన వ్యూహం. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ముగింపు ఏంటో క్లియర్ గా తెలిసిపోతూనే ఉంది. శివసేన మాత్రం ఎమోషనల్ ఎండింగ్ కోరుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు థాకరే […]
రాజీనామాకు సిద్ధమని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించిన తర్వాత, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది శివసేన. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే లేవనెత్తిన హిందుత్వ వాదానికి ఉద్ధవ్ థాకరే నిన్ననే సమాధానమిచ్చారు. అయినా తిరుగుబాటు కొనసాగుతోంది. అందుకే ఈరోజు శివసేన వ్యూహం మార్చింది. మీరు కోరినట్లుగానే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి బైటకొచ్చే ఆలోచన చేస్తాం. కాని మీరు 24 గంటల్లోగా తిరుగుబాటుదారులు రావాలని శివసేన చెప్పింది. గౌహతిలోని ఒక హోటల్లో 42 మంది […]
మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వం దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షుగా కొనసాగుతుంది.కాగా అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయ భేదాలలకు కొంతమంది అధికారులు కారణమని కాంగ్రెస్ నేత అశోక్ చౌహాన్ ఆరోపించడం ఆశ్చర్యపరుస్తోంది. మహారాష్ట్రలోని అధికార సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని మహారాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి,కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అంగీకరించారు. శివసేన నేతృత్వంలోని అధికార సంకీర్ణంలో కాంగ్రెస్ గత కొంతకాలంగా అసంతృప్తి […]
ఒకపక్క దేశ వాణిజ్య రాజధాని ముంబాయి తో సహా మహారాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు రాజకీయంగా కాస్తా ఊరట లభించింది. ప్రభుత్వం కొవిడ్-19 నియంత్రణ చర్యలు చేపడుతున్న ఈ తరుణంలో ఎటువంటి రాజకీయ అనిశ్చితి కి తావులేకుండా.. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర శాసనమండలి ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరుతూ గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు […]
మహారాష్ట్ర రాజకీయాలంటే.. వినిపించే పార్టీ పేర్లు.. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ. ఈ పార్టీలు ఏలుబడిలో ఉన్న మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో మాత్రం సీపీఎం కంచుకోటగా ఉంది. దేశ వ్యాప్తంగా ఓటమి చవిచూస్తున్న సీపీఎంకు అక్కడ మాత్రం గత 60 ఏళ్లుగా విజయమే తప్పా ఓటమనేదే లేదు. మహారాష్ట్రలో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. పాల్గర్ జిల్లా దహాను నియోజకవర్గంలోని తలసరి తహసిల్ పంచాయత్ సమితి ( తెలుగు రాష్ట్రాల్లో మండల పరిషత్)ని సీపీఎం కైవసం చేసుకుంది. […]
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే మూడుముళ్ల బంధం ఏర్పడనుంది. మొన్నీమధ్యనే నిశ్చయ తాంబూలాలు అయ్యాయి.వాస్తవానికి ఈ సంబంధం గత కొన్ని నెలలుగా బలపడుతూ వస్తోంది. ఇరువైపుల నుండి మాటలు జరుగుతున్నాయి. ఒక అంగీకారానికి దాదాపు వచ్చినట్టే. బయటకు చెప్పడం లేదుకానీ ఇప్పటికే ఉంగరాలు మార్చేసుకున్నారు. ఈ వారంలో రెండుసార్లు ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంబంధాన్ని దాదాపు ఖాయం చేశారు. ఇచ్చిపుచ్చుకోవడలపై […]