iDreamPost
android-app
ios-app

మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఎర్పాటుకు బీజేపీ, షిండే రెడీ, నేడే ప్రమాణస్వీకారం?

  • Published Jun 30, 2022 | 12:49 PM Updated Updated Jun 30, 2022 | 4:55 PM
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఎర్పాటుకు బీజేపీ, షిండే రెడీ, నేడే ప్రమాణస్వీకారం?

శివ‌సేన పార్టీని నిట్ట‌నిలువుగా చీల్చి, ఆ రెబ‌ల్స్ గ్రూప్రును బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టూరిస్ట్ ల్లా తిప్పి, మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వానికి కుప్ప‌కూల్చిన సేన తిరుగుబాటుదారుడు ఏక్నాథ్ షిండే ఇప్పుడు త‌న నెక్ట్స్ ప్లాన్ ను అమ‌లు చేయ‌నున్నారు. గోవా రిసార్ట్‌ను విడిచిపెట్టి, ఒంటరిగా ముంబైకి వెళ్లారు. ఇప్పుడు షిండే ఎవ‌రిని క‌లుస్తారు? కొత్త ప్ర‌భుత్వంలో త‌మ గ్రూపుకు కావాల్సిన శాఖ‌ల‌పై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను క‌ల‌వ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న కొత్త ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తునిస్తున్నట్లు గ‌వ‌ర్న‌ర్ కు జాబితానిస్తారు.

మంత్రిప‌దవుల‌పై బీజేపీతో ఇంకా ఎలాంటి చర్చ లేదని, త్వరలోనే క్లారిటీ వ‌స్తుంద‌ని షిండే ట్వీట్ చేశారు. అలాగ‌ని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఇంకా ప్రకటించలేదు. కాని త‌మ‌కు 170 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారాంతానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేత గిరీష్ మహాజన్ అంటున్నారు.

గ‌వ‌ర్న‌ర్ తో స‌మావేశ‌మైన ఆట‌ను ముగించిన దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టనున్నారు. మ‌రి ఏక్ నాథ్ షిండే సంగతేంటి? ఆయ‌న ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వితోనే స‌రిపెట్టుకొంటారు. మ‌రి తిరుగుబాటు ఉద్దేశం ఏంటి? బీజేపీకి అధికార‌మివ్వ‌డ‌మేనా? ఈ ప్ర‌శ్న‌కు త్వ‌ర‌లోనే బ‌దులిస్తాన‌ని ఆయ‌న అంటున్నారు.

ఇప్ప‌టిదాకా షిండే చేసింది శివ‌సేన కూట‌మి ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డం. అది విజ‌య‌వంత‌మైంది. ఇప్పుడు రెండో ప‌నిని మొద‌లుపెడుతున్నారు. శివ‌సేన త‌మ‌దేన‌ని కేసు వేయ‌డం. ఠాక్రే కుటుంబం నుంచి శివ‌సేన‌ను లాక్కోవ‌డం.

షిండే ఇప్ప‌టిదాకా శివ‌సేన నుంచి విడిపోయి, బీజేపీలో విలీనం చేసే ఉద్దేశాన్ని బైట‌పెట్ట‌లేదు. అలాగ‌ని కొత్త పార్టీ గురించి అత‌నికి ఆలోచ‌న ఉన్న‌ట్లు లేదు. ఇప్పుడు తాము నిజమైన శివసేన అని, ఠాక్రేది చిన్న గ్రూపు. అందువ‌ల్ల శాస‌న‌సభాప‌క్ష నేత‌గా ఎన్నికై, బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలన్నది షిండే వ్యూహ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఆమేర‌కు ఉద్ద‌వ్ ఠాక్రేతో చ‌ర్చించే అవ‌కాశ‌మూ ఉంది. అందుకే
ద్ధవ్ ఠాక్రే రాజీనామా మాకు సంతోషం కలిగించే విషయం కాద‌ని తిరుగుబాటు పక్షం అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ అన్నారు.