iDreamPost
android-app
ios-app

తొలి అగ్నివీర్, కొత్త ఎల్‌కె అద్వానీ, దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త ప‌ద‌విపై విప‌క్షాల సెటైర్లు

  • Published Jul 01, 2022 | 5:26 PM Updated Updated Jul 01, 2022 | 5:26 PM
తొలి అగ్నివీర్, కొత్త ఎల్‌కె అద్వానీ, దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త ప‌ద‌విపై విప‌క్షాల సెటైర్లు

ఎత్తుగ‌డ‌ల‌తో, త‌న తెలివితేట‌ల‌తో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన విజేత‌, సీఎం ప‌ద‌వికి రెడీ అయిన గంట తిర‌క్కుండానే , ఉప ముఖ్యమంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ ను, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు ఆడేసుకొంటున్నారు.

రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ట్విట్టర్ లో మిస్టర్ ఫడ్నవిస్‌ను భారతదేశపు మొదటి “అగ్నివీర్” అని చేసిన ట్వీట్ వైరల్ అయిపోయింది.

అగ్నివీర్స్ కొత్త మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ ‘అగ్నిపథ్’ కింద రిక్రూట్ చేయబడిన వారికి పెట్టిన పేరు. నాలుగేళ్లే ఉద్యోగం. ఈ పథకం దేశవ్యాప్తంగా నిరసనలకు కార‌ణ‌మైంది. ఉద్యోగ భద్రతలేక‌పోవ‌డం వ‌ల్లే యువ‌కులు వ్య‌తిరేకించారు. అందుకే ఫ‌డ్న‌వీస్ ను అగ్నివీర్ గా ఆర్జీడీ పేరుపెట్టింది.

స‌రిప‌డా బ‌లమున్నా, ఎందుకు ఫ‌డ్న‌వీస్ ముఖ్య‌మంత్రికాలేక‌పోయారు? ఇదే సందేహం సుప్రీంలో శివసేన తరపున వాదిస్తున్న కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీకి వ‌చ్చింది. ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వవే చాలున‌ని బీజేపీ ఎందుకు అనుకుంది? ఇది ఈ యేడాది అతిపెద్ద ప్ర‌శ్న అనికూడా సింఘ్వీ అన్నారు.

నేత‌ల కొనుగోలు, ఆపరేషన్ లోటస్‌లో భారీగా ఖర్చు చేసినా, సిఎం పదవి వ‌ద్దుకొనేలా బీజేపీకున్న నిర్భంద‌మేంటో, ఈయేడాదిలో అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది” అని ట్వీట్ చేశారు.

అక్క‌డితో ఆగ‌లేదు. రెండుసార్లు సీఎం ఫ‌డ్న‌వీస్, కొత్త ఎల్‌కె అద్వానీ అయ్యార‌ని దెప్పిపొడిచారు. ఒక ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డానికి వేచి ఉండాల్సిందేన‌ని కామెంట్ చేశారు.

నిజానికి, ముఖ్యమంత్రి ప‌ద‌విని పంచుకోవ‌డంపై వ‌చ్చిన వివాద‌మే 2019లో సేన‌, బీజేపీ విడిపోవ‌డానికి కార‌ణ‌మైయ్యింది. అప్పుడే శివ‌సేన‌కు సీఎం ప‌ద‌వినిస్తే, అస‌లు కూట‌మి ప్ర‌భుత్వ‌మే ఎర్ప‌డేదేకాదు.

నేను తిరిగి వ‌స్తాను అన్న ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌ట‌న‌నూ వేళాకోళం చేస్తున్నారు. “నేను తిరిగి వస్తాను కానీ చూడడానికి మాత్రమే” అని మ‌హారాష్ట్ర కాంగ్ర‌స్ ట్వీట్ చేసింది.

నిజానికి, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే, ఫడ్నవీస్‌కు నేత‌లు లడ్డూలు తినిపిస్తున్న వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మ‌హారాష్ట్ర బీజేపీలో ఆయ‌న‌క‌న్నా యోగ్యులైన‌వారు లేర‌నే చెప్పుకోవాలి. అలాంటి ఫ‌డ్న‌వీస్ ఇప్పుడు డిప్యూటీ సీఎం.

నిన్న మధ్యాహ్నం ఫడ్నవీస్ ఇంటిలో కీల‌క నేత‌లు సమావేశమయ్యారు, అక్కడ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్, బిజెపి ప్రధాన కార్యదర్శి సిటి రవి బాంబు పేల్చారు. ఏక్‌నాథ్ షిండే కొత్త ముఖ్యమంత్రి అని ప్ర‌క‌టించారు. అక్క‌డితో ఆగివుంటే బాగుండేది. మాజీ సీఎంను డిప్యూటీగా బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌మ‌ని పార్టీ కోర‌డ‌మే, ఫ‌డ్న‌వీస్ ఇమేజ్ ను దెబ్బ‌తీసింది.

అందుకే NCP శరద్ పవార్ మాట్లాడుతూ, “దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా నంబర్ టూ పదవిని సంతోషంగా అంగీకరించారని నేను అనుకోను” అని కామెంట్ చేశారంట‌.

మొత్తానికి ఏక్ నాథ్ షిండే ముఖ్య‌మంత్రికావ‌డంక‌న్నా, ఫ‌డ్న‌వీస్ ఉప‌ముఖ్య‌మంత్రి కావ‌డ‌మే దేశానికి పెద్ద స‌ర్ప్రైజ్.