తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి కారణంగా ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. దీంతో సబితా ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న సబితా అభిమానులు పార్టీ కార్యకర్తలు, అనుచరులు, ఆందోళన చెందారు. మంత్రి సబిత అస్వస్థతకు గురయ్యారని తెలియగానే పలువురు ముఖ్య నేతలు మంత్రులు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కాగా సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సబిత ఇంద్రారెడ్డి ఆరోగ్యంపై […]