రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ టీఆర్టీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆమె తెలిపారు. కాగా.. మెుత్తం 6,612 పోస్ట్ లకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్ అభ్యర్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ తాజాగా జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ లో మెుత్తం 6,612 టీచర్ పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో 5,059 ఉపాధ్యాయ పోస్ట్ లు ఉండగా.. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1523 పోస్ట్ లు ఉన్నాయి. ఇక ఈ పోస్ట్ ల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని ప్రకటించారు సబితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఇన్ని రోజుల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 12 వేల టీచర్ పోస్ట్ లకు నియామక ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇదికూడా చదవండి: రాజయ్యకి MLA టికెట్ దక్కకపోవడం.. నాకు బాధ కలిగించింది: సర్పంచ్ నవ్య!