iDreamPost
android-app
ios-app

మంత్రి సబితా గన్ మెన్ సూసైడ్.. వారి వేధింపులు తట్టుకోలేక

  • Published Nov 05, 2023 | 12:15 PM Updated Updated Nov 05, 2023 | 12:15 PM

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రచారాలు హోరెత్తాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ నేత, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. తన గన్‌తో

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రచారాలు హోరెత్తాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ నేత, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. తన గన్‌తో

  • Published Nov 05, 2023 | 12:15 PMUpdated Nov 05, 2023 | 12:15 PM
మంత్రి సబితా గన్ మెన్ సూసైడ్.. వారి వేధింపులు తట్టుకోలేక

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. నామినేషన్ ప్రక్రియ మొదలై జోరందుకుంది. ఈ నెల 30వ తేదీన శాసన సభకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. శుక్రవారం నుండి నామినేషన్ల దాఖలు చేయడం షురూ అయ్యింది. తొలి రోజు సుమారు 100 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రెండో రోజైన శనివారం 140 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక పొత్తుల అంశం ఓ కొలిక్కి రావడంతో ఆయా పార్టీలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నేత, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గన్ మెన్ ఆత్మహత్యకు పాల్పడటం ఒక్కసారిగా కలకలం రేగింది.

సబితా ఇంద్రా రెడ్డి వద్ద ఫజల్ అలీ అనే వ్యక్తి గన్ మెన్ గా వ్యహరిస్తున్నాడు. అతడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి.. ఘటనా స్థలిని సబితా పరిశీలించారు. అమీర్ పేట శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్ లో ఫజల్ సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవీస్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం ఆరుగంలకు అతడు ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక సమస్యల వల్లే ప్రాణం తీసుకున్నాడని తెలిసిందన్నారు. ఆయన కుమార్తెతో మాట్లాడిన తర్వాత.. తన సర్వీసు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

ఉదయం కూతురిని డ్యూటీకి తీసుకుని వచ్చిన ఫజిల్.. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్లో కూతురు ముందే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె చెప్పిన వివరాల ప్రకారం.. తన తండ్రి ఓ ప్రైవేటు బ్యాంకు నుండి రూ. 3 లక్షలు లోన్ తీసుకున్నాడని, డబ్బుల విషయమై బ్యాంకు రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెప్పారు. ఇక సబితా ఇంద్రా రెడ్డి గత రెండు సార్లుగా పోటీకి దిగుతున్న మహేశ్వరం స్థానం నుండే ఆమె తిరిగి పోటీ చేస్తున్నారు. ఎన్నికల హడావుడిలో ఉండగానే ఈ వార్త అందండంతో ఆమె సంఘటనా స్థలానికి వెళ్లి.. పరిశీలించారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio