రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలనూ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పలు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో వారు నామినేషన్లను దాఖలు చేయగా, నామినేషన్లకు గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, అందులో 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 14 మంది ఎన్నికయ్యారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్‌లో 4, కర్ణాటకలో 4, హర్యాణాలో […]
దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 55 సీట్లకు గాను 37 సీట్లు ఏకగ్రీవం కాగా 18 సీట్లలో పోలింగ్ అనివార్యమైంది. 8 రాష్ట్రాలలోని ఈ 18 సీట్లకు ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలోని నాలుగు స్థానాలకు అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్ జరుగుతోంది. శాసన సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటును వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో నుంచి ఖాళీ […]
ఉత్తరాదిన రాజ్యసభ ఎన్నికలు సెగలు పుట్టిస్తూ ఉండగా దక్షిణాదిన కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.గుజరాత్,రాజస్థాన్ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్‌కు ప్రయత్నిస్తున్న బిజెపి తాము అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం ఆ ప్రయత్నాలు చేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది.ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ (జెడిఎస్),మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్)లతో పాటు ఇద్దరు బిజెపి అభ్యర్థులు […]
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలలో అధికార జెఎంఎం,కాంగ్రెస్,ఆర్జేడి కూటమి,ప్రతిపక్ష బిజెపి హోరాహోరి తలపడుతున్నారు. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం అధికార కూటమి నుంచి ఇద్దరు అభ్యర్థులు,ప్రతిపక్ష బిజెపి నుండి ఒక అభ్యర్థి బరిలో దిగారు. అధికార కూటమి నుంచి ఒక అభ్యర్థి సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది.కానీ రెండో స్థానానికి పోటీపడుతున్న కాంగ్రెస్ తో పాటు,ప్రతిపక్ష బిజెపికి కూడా సమాన స్థాయిలో 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఎన్నికల ఫలితంపై ఉత్కంఠత నెలకొంది.గత అసెంబ్లీలో […]
రాజ్యసభ ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు బిజెపి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిఎం యడ్యూరప్ప, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ కలిసి రమేశ్ కట్టి, ప్రకాశ్ శెట్టి, ప్రభాకర్ కోరే అన్న పేర్లను ఫైనల్ చేసి అధిష్ఠానానికి పంపారు. అయితే అధిష్ఠానం మాత్రం ముఖ్యమంత్రి యడ్యూరప్ప పంపిన పేర్లను పక్కన పెట్టేసి ఎవరూ ఊహించని విధంగా మరో ముగ్గురు పేర్లను ఫైనల్ చేస్తూ పంపింది. వారిలో ఎరన్న […]
జూన్ 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో ఎదురు దెబ్బ తగిలింది.ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రెండు రాజ్యసభ సీట్లు గెలవాలనే కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు. కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాడా ఎమ్మెల్యే జితూ చౌదరి తమ రాజీనామా పత్రాలను స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి సమర్పించారు. వెంటనే స్పీకర్ వీరి రాజీనామాలను ఆమోదించటం గమనార్హం. ఇంకో ఎమ్మెల్యే కూడా వీరి బాటలోనే రాజీనామా చేసే అవకాశం […]
రాజ్యసభలో పెద్దల ఎంట్రీపై కూడా కరోనా ప్రభావం పడింది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. వచ్చే నెల 4వ తేదీకి రాజ్యసభలో 55 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర […]
ప్రపంచ దేశాలను కబళిస్తోన్న మహమ్మారి కోవిడ్ 19 మనదేశంలోనూ ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి31 వరకు రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ అయ్యాయి. దీంతో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలని […]
ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లో అసెంబ్లీలో ఉన్న స్పష్టమైన ఆధిక్యత దృష్యా మొత్తం నాలుగింటికి నాలుగు స్థానాలు వైసిపి నే సునాయాసంగా గెలుచుకుంటుందనే విషయంలో మొదటినుండి ఎవరికీ ఎటువంటి సందేహం లేనప్పటికీ, వైసిపి నుండి రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థులపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైసిపి రాజ్యసభ అభ్యర్థులు వీరేనంటూ కొందరు తలపండిన రాజకీయ నేతల పేర్లు.. పలువురు వ్యాపారవేత్తల పేర్లు.. కొందరు సినీ ప్రముఖులు ఇలా పలువురి పేర్లు, […]
ఏపీలో రాజ్యసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న ఇద్దరు మంత్రులకు పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశం కల్పించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ సీనియర్ నేతలిద్దరూ స్టేట్ నుంచి సెంటర్ రాజకీయాలకు మారుతుండడం విశేషంగా మారుతోంది. ఈ ఇద్దరు 1989 ఎన్నికల నుంచే తెరమీదకు వచ్చారు. అయితే అప్పట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ తూగో జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించి వైఎస్సార్ వర్గీయుడిగా కొనసాగగా, […]