Idream media
Idream media
దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 55 సీట్లకు గాను 37 సీట్లు ఏకగ్రీవం కాగా 18 సీట్లలో పోలింగ్ అనివార్యమైంది. 8 రాష్ట్రాలలోని ఈ 18 సీట్లకు ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలోని నాలుగు స్థానాలకు అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్ జరుగుతోంది. శాసన సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటును వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీలో నుంచి ఖాళీ అయిన నాలుగు సీట్లకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వైసీపీ తరఫున మోపీదేవీ వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోష్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు బరిలో ఉండగా టీడీపీ తరఫున వర్త రామయ్య పోటీ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో 175 సీట్లకు గాను 151 సీట్లు వైసీపీకి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నికల లాంఛనమే కానుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నామమాత్రమే అని చెప్పవచ్చు.