Idream media
Idream media
రాజ్యసభ ఎన్నికల బరిలోకి టీడీపీ దూకింది. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. తమ పార్టీ తరఫున సీనియర్ నేత వర్ల రామయ్యను పోటీలోకి దింపుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
తాము గెలవడానికో, క్రాస్ ఓటింగ్ వేయడానికో పోటీ చేయడంలేదని, వైఎస్సార్‌సీపీ ద్వంద వైఖరిని ఎండగట్టేందుకు పోటీ చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరఫున దళిత నేత పోటీ చేయడం ధర్మం, న్యాయం అయితే.. మాకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారని, అప్పుడు వర్ల గెలుస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయనకు భయపడితే ఆ పార్టీ వారికే ఓటు వేస్తారని పరోక్షంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. గెలిచినా.. ఓడినా తమ ఓట్లు తాము వేసుకుంటామని చెప్పారు.