మన దేశంలో వినియోగదారుల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత, అవగాహన లేదు కానీ, విదేశాల్లో మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ వినియోగదారలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా చట్టసభలు సైతం తీవ్రంగా స్పందిస్తాయి. ఇప్పుడూ న్యూయార్క్ లోనూ ఇదే జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్రా విషయాల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం తెచ్చేందుకు ముందడుగు వేసింది. మొట్టమొదటి సారిగా యావత్ ప్రపంచంలోనే ఫెయిర్ రిపేర్ యాక్ట్ ను అమలు చేసేందుకు సిద్ధపడింది. వాస్తవానికి నేడు డిజిటల్ వస్తువుల్లో వచ్చే చిన్న […]
బహుశా ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్ ధాటికి బాగా ఎఫెక్టయిన దేశం అగ్రరాజ్యం అమెరికానే కావచ్చు. అమెరికా మొత్తం గడచిన 24 గంటల్లో 25 వేల కరోనా వైరస్ కేసులు రిజస్టర్ అయ్యాయి. ప్రపంచం మొత్తం మీద 24 గంటల్లో ఇన్ని వేల కేసులు ఇంకే దేశంలోను నమోదవ్వలేదు. మెడికల్ ఎమర్జెన్సీ క్రింద దాదాపు 40 రోజుల లాక్ డౌన్ ను వైట్ హౌస్ సడలింపులు ఇవ్వటంతోనే కేసుల తీవ్రత మళ్ళీ పెరిగిపోతున్నట్లు అక్కడి నిపుణులు […]
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. రికార్డు స్ధాయిలో వైరస్ దెబ్బకు 20042 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి దెబ్బకు అత్యధికంగా బలైపోయిన ఇటలీ మృతుల సంఖ్యను అమెరికా దాటేయటం ఆందోళనగా ఉంది. బాధితులు, మృతుల సంఖ్య అమెరికాలో చాలా వేగంగా పెరిగిపోవటమంటే యావత్ ప్రపంచం ఆందోళనకర అంశంగానే పరిగణించాలి. ఏ విషయంలో అయినా మిగితా దేశాలకన్నా తామే గొప్పగా చెప్పుకునే అమెరికాలో ప్రస్తుతం వైరస్ దెబ్బ కూడా చాలా భయంకరంగా ఉందన్నది వాస్తవం. […]
కరోనా వైరస్ దెబ్బకు అమెరికా వణికిపోతోంది. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాల పరిస్ధితి ఎలాగున్నా న్యూయార్క్ లో పరిస్ధితి ఎలాగుందనేందుకు పై ఫొటోనే నిదర్శనం. పై ఫొటోలో కనిపిస్తున్నవి డెడ్ బాడీస్. న్యూయార్క్ సిటిలోని ఆసుపత్రులన్నీ వైరస్ బాధితులతోను, మరణించిన వారితోను నిండిపోతున్నాయి. అమెరికా మొత్తం మీద 3.3 లక్షల మంది బాధితులున్నారు. అలాగే మరో సుమారు 10 వేలమంది చనిపోయారు. అయితే బాధితులు, మరణించిన వారి సంఖ్య మిగిలిన రాష్ట్రాల్లో కన్నా న్యూయార్క్ లోనే చాలా ఎక్కువ. […]
పేరుకు అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం.. అతిపెద్ద ఆయుధ, రక్షణ, వైద్య వ్యవస్థ కలిగిన దేశం.. ఇవన్నీ ఒక కంటికి కనిపించని వైరస్ చేతిలో చిన్నబోయాయి. కొన్ని రోజుల కిందట వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ వైరస్లు తమ దేశాన్ని ఏమీ చేయలేవని ప్రగల్బాలు పలికారు. తమ దేశంలో దాని ప్రభావం ఏమీ ఉండదని బీరాలు పలికారు. అందుకే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు […]