iDreamPost
android-app
ios-app

పుట్టినరోజు నాడు కుమార్తెకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సురేఖా వాణి!

  • Published Jul 30, 2023 | 1:53 PM Updated Updated Jul 30, 2023 | 1:53 PM
  • Published Jul 30, 2023 | 1:53 PMUpdated Jul 30, 2023 | 1:53 PM
పుట్టినరోజు నాడు కుమార్తెకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సురేఖా వాణి!

సురేఖా వాణి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని సీనియర్ నటి. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా చాలా సినిమాల్లో బ్రహ్మానందం భార్యగా ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం సురేఖా వాణి సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె కావాలని దూరంగా లేనని.. అవకాశాలు రాకనే దూరమవ్వాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. సినిమా తర్వాత సురేఖా వాణికి ఆమె కుమార్తె ప్రపంచం అని అందరికీ తెలిసిందే.

సురేఖా వాణి- కుమార్తె సుప్రిత తళ్లీకూతుళ్లలా కంటే.. ఫ్రెండ్స్ లా ఉంటారు. ఎప్పుడూ కలిసే వెకేషన్ కి వెళ్లడం చేస్తారు. పార్టీలు, షికార్లు కూడా ఇద్దరూ కలిసే వెళ్తుంటారు. ప్రస్తుతం సురేఖా వాణి- సుప్రీత వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ లోనే కుమార్తెకు పుట్టినరోజు సందర్భంగా సురేఖా వాణి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వివరాలను తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ గిఫ్ట్ ఏంటంటే.. న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ లో సుప్రీతకు బర్త్ డే విషెస్ యాడ్ రూపంలో వేయించారు. ఆమె తండ్రితో ఉన్న ఒక పిక్ పెట్టి హ్యాపీ బర్త్ డే సుప్రీత అని డిస్ ప్లే చేయించారు. ఆ పిక్ చూసిన సుప్రీత ఆనందానికి అవధులలు లేకుండా పోయాయి.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

ప్రపంచంలో బుర్జ్ ఖలీఫా మీద వీడియో ప్లే చేయడం ఎంత ఫేమసో.. టైమ్స్ స్క్వేర్ లో ఇలా విషెస్ రావడం అంటే కూడా అంతే గ్రేట్ గా చెప్పుకోవచ్చు. కుమార్తె కోసం అలాంటి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సురేఖా వాణిని అంతా పొగిడేస్తున్నారు. కూతురుకి తండ్రిలేని లోటు తెలియకుండా పెంచడం మాత్రమే కాకుండా.. ఆమె ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా తయారు చేస్తున్నారు అంటూ ప్రశంసిస్తున్నారు. సుప్రీతను కూడా తల్లిలాగానే ఒక మంచి నటిని చేయాలంటూ కోరుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అంతా సుప్రీతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సురేఖా వాణి చెప్పిన పుట్టిన రోజు విషెస్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

ఇంక సుప్రీత కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటికే ప్రైవేట్ సాంగ్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటూ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్లాగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాల పరంగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎదురుచూస్తోంది. మంచి పాత్ర దొరికితే చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న విషయాన్ని ఎప్పుడో వెల్లడించింది. మరి.. పుట్టినరోజు సందర్భంగా సుప్రీతకు మీ విషెస్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by dimaakkarab (@dimaakkarab)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio