iDreamPost
android-app
ios-app

Hero Vishal: తన వైరల్ వీడియోపై స్పందించిన విశాల్!

  • Published Dec 28, 2023 | 5:59 PM Updated Updated Dec 28, 2023 | 6:03 PM

హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా వార్తలతో పాటు.. సమాజంలో జరిగే అంశాలపై ప్రశ్నిస్తూ ఉంటారు. తాజాగా తనకు సంబంధించిన ఓ వీడియోపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా వార్తలతో పాటు.. సమాజంలో జరిగే అంశాలపై ప్రశ్నిస్తూ ఉంటారు. తాజాగా తనకు సంబంధించిన ఓ వీడియోపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

  • Published Dec 28, 2023 | 5:59 PMUpdated Dec 28, 2023 | 6:03 PM
Hero Vishal: తన వైరల్ వీడియోపై స్పందించిన విశాల్!

నేటికాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. చాలా మంది దీనిలోనే మునిగితేలుతున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖలకు సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం తెలిసిన క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతేకాక ఆ వీడియోలు, న్యూస్ నిజమా? కాదా? అనేది పట్టించుకోరు. పైగా కొందరు నెటిజన్లు అయితే ఏకంగా వైరల్ వీడియోపై నెగిటీవ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇలా చేయడం కారణంగా చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులకు గురవుతుంటారు. తాజాగా హీరో విశాల్ కూడా అలానే  ఇబ్బందికి గురయ్యాడు.  వైరల్ అయిన తన వీడియోపై విశాల్ స్పందించారు. తనను క్షమించండి అంటూ ట్వీట్ చేశారు. మరి.. అసలు ఆ వీడియో ఏంటి, విశాల్ క్షమిచమని అడగటం ఏంటి?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్ కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి.. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాందించాడు. అతడికి కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, కన్నడ వంటి దక్షిణాది భాషాల్లో మంచి మార్కెటింగ్ ఉంది. విశాల్ పొగరు, పందెం కోడి, భరణి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.

please forgive me

ఇక ఆయన కేవలం సినిమాలో కాకుండా సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తుంటారు. గతంలో నడిఘర్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఇది ఇలా ఉంటే.. హీరో విశాల్ కి సంబంధించిన ఓ వీడియో ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అన్యూయార్క్‌ వీధుల్లో ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ కనిపించే ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వచ్చాయి. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ కొందరు విశాల్ ను విమర్శించారు. దీనిపై విశాల్‌ స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. అందరూ తనను క్షమించమని తెలిపాడు. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పే సమయం వచ్చిందన్నారు. ఆ వీడియోలో కొంచెం వాస్తవం, కొంచెం ప్రాంక్ కలిసి ఉందని విశాల్ పేర్కొన్నారు. అది ప్రదేశం పరంగా చూస్తే.. న్యూయార్క్ లో తీసిందే ఆ వీడియో అని తెలిపాడు. తాను, తన కజిన్స్ తరచుగా అక్కడకు వెళ్లి సరదగా గడుపుతుంటామని తెలిపాడు. తాను ఏడాదంతా పడిన కష్టాన్ని మర్చిపోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి తరచూ న్యూయార్ కు వెళ్తుంటానని విశాల్ తెలిపాడు. అలానే ఇటీవల కూడా న్యూయార్క్ వెళ్లాలని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ…”ఆ వీడియోలో నేను మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ప్రాంక్‌ వీడియో కాబట్టి. క్రిస్మస్‌ రోజు నాతో సరదాగా మా కజిన్స్‌ అందరూ ప్రాంక్‌ వీడియో చేశారు. అది కూడా వాళ్లు నన్ను ఆటపట్టించడం కోసం చేశారు. అంతే తప్ప అందులే ఏమిలేదు. అలా చేయాలని నాతో చెప్పి వీడియో తీశారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.  నేను ఇచ్చిన క్లారిటీతో ఇప్పటికైనా ఆ వీడియోపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని ఆశిస్తున్నా. కొంతమంది ఆ వీడియో వీక్షించి నన్ను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినీ ద్వేషించాలని అనుకోవడం లేదని విశాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇక విశాల్ సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. అలానే ప్రస్తుతం ‘రత్నం’ అనే సినిమాలో నటిస్తున్నారు. హరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  అలానే తుప్పరివాలన్ 2 అనే సినిమాలో కూడా నటించనున్నారు. మరి.. తన వీడియోపై విశాల్ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ramesh Bala (@rameshlausinsta)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet