iDreamPost

డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి చాట్ జీపీటీ!

ChatGpt Spots Deep Fakes: డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఫేసులు మార్ఫింగ్ చేసి రియల్ వీడియోస్ ని తలపించేలా రూపొందిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఇలాంటి వారి ఆటలు కట్టించడానికి చాట్ జీపీటీ రంగంలోకి దిగింది. 

ChatGpt Spots Deep Fakes: డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఫేసులు మార్ఫింగ్ చేసి రియల్ వీడియోస్ ని తలపించేలా రూపొందిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఇలాంటి వారి ఆటలు కట్టించడానికి చాట్ జీపీటీ రంగంలోకి దిగింది. 

డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి చాట్ జీపీటీ!

‘నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఏఐ కూడా తనతో తానే పోటీ పడుతుంది. అవును ఏఐ వల్ల ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయో.. దుష్ప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి. ఒక పక్క పాజిటివ్ ఏఐ, మరోపక్క నెగిటివ్ ఏఐ. ఇప్పుడు డీప్ ఫేక్.. ఏఐకి అతిపెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో డీప్ ఫేక్ ని గుర్తించడంలో చాట్ జీపీటీ ఎంతో తెలివైనదని ఒక స్టడీలో తేలింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ఛాలెంజ్ లు కూడా ఉన్నాయి. అదేంటంటే.. ఈ ఏఐ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొంతమంది డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. దీని వల్ల చాలా మంది మోసపోతున్నారు.

ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టడం ఏఐకి అతి పెద్ద సవాల్. ఏఐ టెక్నాలజీస్ ని వాడుకుని డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. దీనికి ఇప్పుడు చాట్ జీపీటీతో చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. న్యూయార్క్ కి చెందిన ‘యూనివర్సిటీ ఆఫ్ బఫెలో’ లీడ్ చేస్తున్న రీసెర్చ్ టీమ్.. డీప్ ఫేక్ వీడియోల్లో మనుషుల ముఖాలు ఫేకా? అసలా? అనే తేడాను గుర్తించేలా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంఎస్)ని అప్లై చేశారు. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా డీప్ ఫేక్ వీడియోలను గుర్తించే అల్గారిథంల ముందు ఎల్ఎల్ఎంఎస్ వెనుకబడినప్పటికీ భవిష్యత్తులో డీప్ ఫేక్ వీడియోలను గుర్తించగలవని పరిశోధకులు చెబుతున్నారు.    

డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలను గుర్తించడంలో చాట్ జీపీటీ ప్రతిభ:

ఇంటర్నెట్ నుంచి 300 బిలియన్ పదాలతో కూడిన డేటాసెట్ పై శిక్షణ పొందిన చాట్ జీపీటీ.. స్టాటిస్టికల్ పేటర్న్స్ ని, పదాల మధ్య సంబంధాలను గుర్తిస్తుంది. చాట్ జీపీటీ లేటెస్ట్ ఇటరేషన్స్, ఇతర లాంగ్వేజ్ మోడల్స్ ఇమేజ్ అనాలసిస్ ని చేర్చడానికి వాటి సామర్థ్యాలను విస్తరించాయి. మీడియా ఫోరెన్సిక్స్ ల్యాబ్ టీం.. ఒక ఇమేజ్ లో ఉన్న ముఖం నిజమైన మనిషిదా? లేక ఏఐ జనరేట్ చేసిన ముఖమా? అనే తేడాను విజన్ జీపీటీ 4వి, జెమిని 1.0ల మీద ప్రయోగం చేపట్టారు. ఈ రెండిటితో వేల కొద్దీ ఇమేజ్ లను టెస్ట్ చేసి చూశారు. ఆ ఇమేజెస్ లో ఉన్న ముఖాలు నిజమా? ఏఐ జనరేటెడ్ అని అడగ్గా.. చాట్ జీపీటీ 79.5 శాతం యాక్యురసీ రేటుని సాధించింది.     

చాట్ జీపీటీ ప్రయోజనాలు:

మనిషి కళ్ళజోడు పెట్టుకున్న ఏఐ జనరేటెడ్ ఫోటోని చాట్ జీపీటీ అనలైజ్ చేసింది. ఇమేజ్ కి ఎడమ వైపున ఉన్న జుట్టు బ్లర్ అయ్యిందని, అలానే మనిషి వెనుక బ్యాక్ గ్రౌండ్ అర్థవంతంగా లేదని, డెప్త్ కూడా లేదని గుర్తించింది. అయితే డీప్ ఫేక్ డిటెక్షన్ మోడల్స్ అనేవి ఒక ఇమేజ్ రియల్ ఆ? ఫేకా? అనేది చెబుతుంది గానీ అది నిజం అని చెప్పడానికి ఎలాంటి వివరణ ఇవ్వవు. కానీ ఈ విషయంలో చాట్ జీపీటీ అద్భుతమైన రిజల్ట్ ని ఇస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. డీప్ ఫేక్ వీడియోలను, ఫోటోలను గుర్తించేందుకు జరిపిన పరిశోధనలో వారు చెప్తున్నదేంటంటే.. చాట్ జీపీటీ అర్థవంతమైన నాలెడ్జ్ ని కలిగి ఉందని. అలానే సహజ భాషను ప్రాసెసింగ్ చేయడం ద్వారా డీప్ ఫేక్ డిటెక్షన్ లో అటు యూజర్స్ కి, ఇటు డెవలపర్స్ కి ఇద్దరికీ ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీ టూల్ గా ఉంటుందని స్టడీలో తేలింది. 

ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. అందుబాటులోకి వస్తే కనుక చాలా మందికి ఇది ప్రయోజనం చేకూర్చుతుంది. ఎవరైనా స్కామర్లు..  డీప్ ఫేక్ టెక్నాలజీతో మీకు తెలిసిన వ్యక్తుల్లా మాట్లాడితే ఆ వీడియోని స్క్రీన్ షాట్ తీసి చాట్ జీపీటీ సహాయంతో ఆ మనిషి రియల్ ఆ? డీప్ ఫేక్ ఆ? అనేది గుర్తించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి