iDreamPost
android-app
ios-app

న్యూయార్క్ లో పరిస్ధితి మరీ ఘోరంగా మారిపోయిందా ?

  • Published Apr 06, 2020 | 6:13 PM Updated Updated Apr 06, 2020 | 6:13 PM
న్యూయార్క్ లో  పరిస్ధితి మరీ ఘోరంగా మారిపోయిందా ?

కరోనా వైరస్ దెబ్బకు అమెరికా వణికిపోతోంది. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాల పరిస్ధితి ఎలాగున్నా న్యూయార్క్ లో పరిస్ధితి ఎలాగుందనేందుకు పై ఫొటోనే నిదర్శనం. పై ఫొటోలో కనిపిస్తున్నవి డెడ్ బాడీస్. న్యూయార్క్ సిటిలోని ఆసుపత్రులన్నీ వైరస్ బాధితులతోను, మరణించిన వారితోను నిండిపోతున్నాయి. అమెరికా మొత్తం మీద 3.3 లక్షల మంది బాధితులున్నారు. అలాగే మరో సుమారు 10 వేలమంది చనిపోయారు.

అయితే బాధితులు, మరణించిన వారి సంఖ్య మిగిలిన రాష్ట్రాల్లో కన్నా న్యూయార్క్ లోనే చాలా ఎక్కువ. మొత్తం బాధితుల్లో న్యూయార్క్ లోనే సుమారు లక్షకు పైగా ఉన్నారు. అలాగే దగ్గర దగ్గర మూడు వేలమంది చనిపోయారు. ఒక్కసారిగా వేలకువేలమంది బాధితులు వచ్చేస్తుండటంతో వారిని చేర్చుకోవటానికి ఆసుపత్రులు సరిపోవటం లేదు. రోగులను చేర్చుకోవటానికే ఆసుపత్రుల లేదని అవస్తలు పడుతుంటే ఇక చనిపోయిన వారి సంగతి మరో సమస్యగా మారిపోయింది.

ఆసుపత్రుల్లో చనిపోతున్న వారి సంఖ్య వేలల్లో ఉండటం వల్ల ఆసుపత్రుల్లో మార్చురీలు సరిపోవటం లేదట. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచక చాలా ఆసుపత్రుల క్యారిడార్లలోనే డెబ్ బాడీస్ ను ఉంచేస్తున్నాయట. చనిపోయిన వారిని జిప్ బ్యాగుల్లో ప్యాక్ చేసి వాటిపైన అడ్రస్ లు రాసి వదిలేస్తున్నారు. ఆసుపత్రుల వరండాలు కూడా సరిపోకపోవటంతో మొబైల్ మార్చురీలు ఏర్పాటు చేశారు.

చివరకు అవికూడా సరిపోకపోవటంతో ఖాళీగా ఉన్న భవనాలను తీసేసుకుని వాటిలో ఏసి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఖాళీ భవనాల్లో వరుసగా ర్యాకులు ఏర్పాటు చేసి వాటిల్లో డెడ్ బాడీస్ ను ఉంచేస్తున్నారు. చనిపోయిన వాటి తాలూకు వాళ్ళు ఎవరైనా వస్తే వాటిని అప్పగిస్తారు లేకపోతే ప్రభుత్వమే చేయాల్సిన పని చేసేస్తుంది. మొత్తానికి న్యూయార్క్ పరిస్ధితి తలచుకుంటునే గుండెలు పిండేస్తోంది అందరికీ.