నర్సీపట్నం మునిసిపల్ కమీషనర్ కృష్ణవేణి తెలుగుదేశం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దుర్భాషలాడటమే కాకుండా తనను వివస్త్రను చేస్తాం అని బహిరంగంగా బెదిరింపులకు దిగినట్టు చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే నర్సీపట్నంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మునిసిపల్ కమీషనర్ ఆఫీసులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన తాతగారైన లట్చ పాత్రుడి ఫొటోని ఆఫీసు నుండి ఎందుకు తొలగించారంటు దురుసుగా ప్రవర్తించారు. కార్యాలయం మరమ్మత్తులు నిమిత్తం తీసి వేరే గదిలో భద్రపరిచాం […]
విశాఖలోని పోర్టు ప్రభుత్వ ఆస్పత్రిలోని మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సుధాకర్ ఘటనలో పోలీసులు ఇచ్చిన నివేదికకు, సుధాకర్ ఇచ్చిన వాగ్మూలానికి మధ్య వ్యత్యాసం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సుధాకర్ శరీరంపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి అనుమానంగా ఉండడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు […]
నర్సీపట్నం ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్యం అందించాల్సిన బాధ్యత గల ఓ డాక్టర్ వ్యవహారం గడిచిన నెలలో పెద్ద వివాదంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మత్తు డాక్టర్ సుధాకర్ తీరు మీద అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి. చివరకు ప్రభుత్వం అతన్ని సస్ఫెండ్ కూడా చేసింది. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం మాని, మీడియాలో రాజకీయ విమర్శలకు పూనుకోవడం అతని మీద చర్యలకు కారణంగా మారింది. ఇక ఇప్పుడు మళ్లీ నెల రోజులు గడవక ముందే […]
ఓ ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సస్ఫెండ్ అయ్యారు. సాధారణ రోజుల్లో ఇది పెద్ద విశేషం కాదు. విధి నిర్వహణలో హద్దులు మీరిన వారెవరయినా సస్ఫెండ్ అవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మహమ్మారి విస్తృతమవుతున్న సమయంలో విధి నిర్వహణల నుంచి ఓ వైద్యుడిని తప్పించాల్సి రావడం ప్రభుత్వానికి కూడా పెద్ద ఆసక్తి ఉండదు. అయినప్పటికీ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ ని సస్ఫెండ్ చేయడం చూస్తుంటే ఆయన ఏ స్థాయిలో వ్యవహరించారన్నది అర్థం అవుతుంది. డాక్టర్ విధులేంటి..పరిధులేంటి డాక్టర్ […]
నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయటంపై చంద్రబాబునాయుడు ఎందుకు ఉలికిపడుతున్నాడో అర్ధం కావటం లేదు. పైగా డాక్టర్ సస్పెన్షన్ వార్త రావటం ఆలస్యం వెంటనే చంద్రబాబు ట్విట్టర్లో ప్రభుత్వంపై ఆరోపణలు మొదలుపెట్టేశాడు. కరోనా వైరస్ వైద్యం చేస్తున్న డాక్టర్ ఎస్ 95 మాస్కు, గ్లౌజ్ కావాలని అడగటమే సుధాకర్ చేసిన పాపమా ? అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించేశాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని 15 ఏళ్ళ సిఎంగా చేశానని చెప్పుకునే […]
చెస్ నేనెమన్నాను..అసలు నాకేమి సంబంధం .అక్కడ సౌకర్యాలు ఉన్నాయోలేవో అవన్నీ డాక్టర్లు చూసుకుంటారు. ఈ వ్యవహారంలో నాకేమీ సంబంధం లేదు.ఉన్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంతాను అని సీనియర్ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అన్నట్లుగానే నర్సీపట్నం ఆస్పత్రి మత్తు డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల్లో అయ్యన్న పాత్రుడి పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని, డాక్టర్లు ప్రమాదపుటంచున పని చేస్తున్నారని, వారికి వ్యక్తిగత భద్రతా కిట్లు లేనేలేవని ఆరోపిస్తూ […]
తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు మనిషిగా ముద్ర పడ్డ నర్సీపట్నం వివాదాస్పద మత్తు డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తు ఎట్టకేలకు వైద్య విధాన పరిషత్ కమీష్నర్ ఉత్తర్వులు జారీ చెసారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో తీవ్ర రూపందాల్చి ఉన్న ఈ సమయంలో వృత్తి ధర్మమాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత స్వలాభం కోసం డాక్టర్లు, మాస్కులు కొరత ఉంది అంటు ఉన్నతాధికాలులు, పోలీసులు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్, ఒక్కసారిగా వార్తల్లొ వ్యక్తిగా మారిపొయారు. […]
కరోనా కలకలం తగ్గుతుందేమో గానీ ఏపిలో పొలిటికల్ రగడ చల్లారేలా లేదు. ఇప్పటికే సహాయక చర్యలు చుట్టూ సాగుతున్న రాజకీయం చాలా మందిని విస్మయానికి గురిచేస్తోంది. అందుకు తోడుగా ఇప్పుడు ఏకంగా ఆస్పత్రి సాక్షిగా రాజకీయాలకు తెరలేపడం విస్మయకరంగా మారింది. విశాఖ జిల్లా నర్సీపట్నం లో సాగుతున్న ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. నర్సీపట్నంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా సోమవారం విశాఖ అడిషినల్ డీజీపీ […]