iDreamPost
android-app
ios-app

నర్సీపట్నం: ప్రియురాలికి విషమిచ్చి చంపిన టెకీ కేసులో కీలక పరిణామం

  • Published Feb 09, 2024 | 11:19 AM Updated Updated Feb 09, 2024 | 11:19 AM

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకుని.. ఆ తర్వాత ప్రియురాలికి విషమిచ్చి చంపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకుని.. ఆ తర్వాత ప్రియురాలికి విషమిచ్చి చంపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Feb 09, 2024 | 11:19 AMUpdated Feb 09, 2024 | 11:19 AM
నర్సీపట్నం: ప్రియురాలికి విషమిచ్చి చంపిన టెకీ కేసులో కీలక పరిణామం

కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన దారుణం తెలుగు రాష్ట్రాల ప్రజలని ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమించిన యువతికి విషమిచ్చి అత్యంత కిరాతకంగా హతమర్చాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిని శారీరకంగా వాడుకుని.. ఆ తర్వాత ఆమెకి విషమిచ్చి చంపేశాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఈ దారుణం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది. శారదానగర్‌కు చెందిన యువతి రుత్తల రత్నమాధురి ప్రియుడి చేతలో మోసపోవడమే కాక ఆఖరికి అతడి చేతిలోనే తన ప్రాణాలు కూడా పొగొట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా పోలీసులు రత్నమాధురి హత్యకు కారణమైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వాసిరెడ్డి సన్యాసినాయుడు అలియాస్‌ శేఖర్‌ని అరెస్ట్‌ చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.

ఇక రత్నమాధురి, శేఖర్‌ ఇద్దరూ హైదరాబాద్‌లో ఒకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుండేవారు. ఈ క్రమంలో వీరికి ఏర్పడిని పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఆరేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. లవ్‌ చేసుకుంటున్నాం.. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అంటూ రత్నమాధురికి మాయమాటలు చెప్పి.. ఆమెని శారీరకంగా లోబర్చుకున్నాడు శేఖర్‌. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని అడగ్గా.. దాటవేస్తూ వచ్చాడు. చివరకు.. తమ ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని.. అందుకే రత్నమాధురిని పెళ్లి చేసుకోలేనని చెబుతూ వచ్చాడు.

ఇదిలా ఉండగా రత్నమాధురి, శేఖర్‌లు గత కొన్నాళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా వారి వారి ఇంటి దగ్గరే ఉండి పని చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 27న వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా విశాఖలోని ఓ లాడ్జికి వెళ్లారు. ఇక అదే రోజు రాత్రి రత్నమాధురిని తీసుకొచ్చి శారదానగర్‌లోని ఆమె ఇంటి వద్ద దింపి వెళ్లిపోయాడు శేఖర్‌. ఆ మరుసటి రోజు ఉదయం నుంచి మాధురి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో ఆమెని ఆస్పత్రిలో చేర్చారు.

అయితే మాధురి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో.. ఆమె కుటుంబ సభ్యులకు శేఖర్‌ మీద అనుమానం వచ్చి అతడిని నిలదీశారు. దాంతో అతడు ఒక పాయిజన్‌ బాటిల్‌ ఫొటోని వారికి వాట్సాప్‌ చేశాడు. ఆందోళనకు గురైన మాధురి తల్లి అమ్మాజీ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెపై శేఖర్‌ విషప్రయోగం చేశాడని ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.