iDreamPost
android-app
ios-app

6 ఏళ్ళ లవ్.. ప్రియురాల్ని లాడ్జికి తీసుకెళ్లి.. సినిమా రేంజ్ ట్విస్ట్!

  • Published Feb 05, 2024 | 1:58 PM Updated Updated Feb 05, 2024 | 2:23 PM

ప్రేమించుకున్నంత సేపు ఓ మాట.. పెళ్లి అనగానే మరో మాట పలుకుతున్నాడు ప్రియుడు. పెళ్లి ఊసెత్తితే చాలూ.. ఇప్పుడు కాదు, పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు.. సరైన సమయం కాదూ అంటూ సవాలక్ష కారణాలు చెబుతూ దాట వేస్తున్నాడు. దీంతో ప్రియురాలు..

ప్రేమించుకున్నంత సేపు ఓ మాట.. పెళ్లి అనగానే మరో మాట పలుకుతున్నాడు ప్రియుడు. పెళ్లి ఊసెత్తితే చాలూ.. ఇప్పుడు కాదు, పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు.. సరైన సమయం కాదూ అంటూ సవాలక్ష కారణాలు చెబుతూ దాట వేస్తున్నాడు. దీంతో ప్రియురాలు..

  • Published Feb 05, 2024 | 1:58 PMUpdated Feb 05, 2024 | 2:23 PM
6 ఏళ్ళ లవ్..  ప్రియురాల్ని లాడ్జికి తీసుకెళ్లి.. సినిమా రేంజ్ ట్విస్ట్!

వారిద్దరిదీ ఆరేళ్ల ప్రేమ. ఈ లవ్ ట్రాక్..మూడు ముళ్ల బంధంగా మారాలని ఆశపడింది ప్రియురాలు. అయితే ఈ విషయంపై ప్రియుడితో పలుమార్లు చర్చించగా.. అప్పుడు కాదూ ఇప్పుడు కాదూ అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు ఈ విషయంపై మట్లాడుకుందామంటూ బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ప్రేయసిని ఇంటి వద్ద దించేశాడు. కానీ అనూహ్యంగా ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఆమెకు ఏం అయ్యిందో అని ఆందోళన చెందుతున్న సమయంలో అమ్మాయి నోటి వెంట అవాక్కయ్యే విషయం రావడంతో ఖంగుతిన్నారు తల్లిదండ్రులు. చివరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ.. యువతి కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయింది. ఇంతకు ఏం జరిగిందంటే..

అనకాపల్లి జిల్లా నర్సీ పట్నంలో ఘోరం చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విష ప్రయోగానికి గురై.. చికిత్స పొందుతూ మరణించింది. ప్రియుడు ఆమెపై విష ప్రయోగం చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నర్సీపట్నం శారద నగర్‌లో నివాసముంటున్న అమ్మాజీ కూతురు రత్న మాధురి, నాతవరం మండలం వెన్నలపాలేనికి చెందిన వాసిరెడ్డి చంద్రశేఖర్ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్స్. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ శేఖర్ పై ఒత్తిడి తీసుకు వస్తుంది రత్న.

ఈ విషయంపై మాట్లాడేందుకు ఈ గత నెల 27న ఇద్దరు విశాఖ పట్నంలోని లాడ్జికి వెళ్లి.. ఓ రూం తీసుకుని ఉన్నారు. అదే రోజు తిరిగి ఇంటికి వచ్చేశారు. రత్న మాధురిని ఆమె నివాసం వద్ద వదిలి వెళ్లిపోయాడు శేఖర్.. ఒంట్లో నీరసంగా ఉందని రత్న పడుకుంది. మరుసటి రోజు ఆమెకు వాంతులు రావడం మొదలు పెట్టాయి. 30న ఆమె పరిస్థితి దిగజారడంతో స్థానిక ఆసుపత్రికి.. అక్కడ నుండి విశాఖకు తరలించారు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. అయితే తల్లిదండ్రులు చెబుతున్న వివరాల ప్రకారం.. శేఖర్ సినిమా క్రైంని తలపించేలా తన కూతురు జీవితంతో ఆడుకున్నాడని అంటున్నారు.

 ‘ఆ అబ్బాయి ప్రీ ప్లాన్ గా మర్డర్ చేశాడు. బయటకు తీసుకెళ్లి.. విష ప్రయోగం చేశాడు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం కూతురు మాకు చెప్పింది. రత్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అందర్ని నమ్మించేందుకు స్లో పాయిజన్ ఇచ్చాడు శేఖర్’ అని విమర్శించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ రత్న కోరడంతో.. ఆమెను వదిలించుకునేందుకు అతడు విష ప్రయోగం చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ప్రియుడు శేఖర్ పరారీలో ఉన్నాడు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio