Idream media
Idream media
చెస్ నేనెమన్నాను..అసలు నాకేమి సంబంధం .అక్కడ సౌకర్యాలు ఉన్నాయోలేవో అవన్నీ డాక్టర్లు చూసుకుంటారు. ఈ వ్యవహారంలో నాకేమీ సంబంధం లేదు.ఉన్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంతాను అని సీనియర్ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అన్నట్లుగానే నర్సీపట్నం ఆస్పత్రి మత్తు డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల్లో అయ్యన్న పాత్రుడి పాత్ర ఉన్నట్లు తేలింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని, డాక్టర్లు ప్రమాదపుటంచున పని చేస్తున్నారని, వారికి వ్యక్తిగత భద్రతా కిట్లు లేనేలేవని ఆరోపిస్తూ డాక్టర్ సుధాకర్ ఆరోపణలు చేశారు. అయితే దానికి ముందు తాను అయ్యన్న పాత్రుడితో సమావేశమై మాట్లాడినట్లు సదరు డాక్టర్ ఓ టివి ఛానల్ కు వెల్లడించారు. అంతేకాకుండా అయ్యన్న చెప్పామన్నట్లు తాను మాట్లాడానని ఆయన అంగీకరించారు. దంతోబాటు ఆయన అయ్యన్న ఇంట్లోకి వెలుతున్నట్లున్న సీసీ కెమెరాల ఫుటేజీ కూడా బయటకు వచ్చింది.
ఈ నేపథ్యంలో సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన ఆరోపణలు చేస్తున్నట్లుగా అక్కడి పరిస్థితులు లేవని ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. చివరకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని, క్రమశిక్షణను ఉల్లంఘించారనన్న ఆరోపణలతో ఆయన పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది.
అయితే ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని బుకాయించిన అయ్యన్న పాత్రుడి పాత్ర స్పష్టంగా వెళ్లడవడంతో ముందుగా చెప్పినట్లుగా రాజకీయాల నుంచి వైదొలిగి రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా లేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన్ను ప్రశ్నిస్తున్నాయి. మాటమీద నిలబడి రాజకీయాలకు గుడ్ బై చెబుతారా …రాజజీయాలన్నాక వంద అంటాం అన్నీ పట్టించుకుంటే ఎలా అని బండ్ల గణేష్ మాదిరిగా తప్పించుకుంటారా చూడాలి