iDreamPost
android-app
ios-app

డాక్టర్ ను సస్పెండ్ చేస్తే చంద్రబాబు కు ఎందుకు ఉలుకు ?

  • Published Apr 08, 2020 | 7:21 PM Updated Updated Apr 08, 2020 | 7:21 PM
డాక్టర్ ను సస్పెండ్ చేస్తే చంద్రబాబు కు ఎందుకు ఉలుకు ?

నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయటంపై చంద్రబాబునాయుడు ఎందుకు ఉలికిపడుతున్నాడో అర్ధం కావటం లేదు. పైగా డాక్టర్ సస్పెన్షన్ వార్త రావటం ఆలస్యం వెంటనే చంద్రబాబు ట్విట్టర్లో ప్రభుత్వంపై ఆరోపణలు మొదలుపెట్టేశాడు. కరోనా వైరస్ వైద్యం చేస్తున్న డాక్టర్ ఎస్ 95 మాస్కు, గ్లౌజ్ కావాలని అడగటమే సుధాకర్ చేసిన పాపమా ? అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించేశాడు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని 15 ఏళ్ళ సిఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు ప్రభుత్వంలో డాక్టర్ గా చేస్తున్న సుధాకర్ చేసిన తప్పేమిటో తెలీదా ? తనకు మాస్కులు, గ్లౌజ్ కావాలంటే పై అధికారులకు చెప్పాలే కానీ మీడియా ముందో లేకపోతే మొబైల్ లో వీడియో తీసి సర్క్యులేట్ చేయటమేనా ? పైగా ప్రభుత్వంలోని అధికారులపైనే కాకుండా తన పై అధికారిపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అదీ కాకుండా తాను మీడియా ముందు చెప్పిందంతా రాష్ట్రమంతా ప్రచారం చేయమని కోరటమే విచిత్రంగా ఉంది.

అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్ గా అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేశాడని. నెల రోజుల్లో రిటైర్ అవబోతున్న తన పై అధికారికి ఇంకా ఉద్యోగం ఎందుకు లీవు పెట్టి ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అడగటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయకూడదన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? అసలు డాక్టర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని సహచర డాక్డర్లు చెప్పిన విషయం చంద్రబాబుకు ఎక్కలేదా ? ఏదేమైనా డాక్టర్ ను సస్పెండ్ చేయగానే చంద్రబాబు రియాక్ట్ అవ్వటమే విచిత్రంగా ఉంది.