iDreamPost
android-app
ios-app

దారుణం: 60 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం!

  • Published Sep 25, 2023 | 9:47 PM Updated Updated Sep 25, 2023 | 9:47 PM
  • Published Sep 25, 2023 | 9:47 PMUpdated Sep 25, 2023 | 9:47 PM
దారుణం: 60 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం!

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అస్సలు మనం మనుషుల మధ్యే ఉన్నామా అన్న అనుమానం కలగకమానదు. ఆడ పిల్లలు, మహిళలపై దుర్మార్గులు లైంగిక దాడులకు ఒడిగడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలుడు 60 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రావికమతం పరిధిలోని జెడ్ కొత్తపట్నంలో గ్రామంలో 60 ఏళ్ల వృద్ధురాలు శనివారం ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు ఆ వృద్దురాలిపై కన్నేశాడు. మెల్లగా ఆమెతో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఆ మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు గమనించారు.

ఏం జరిగిందని ఆ వృద్ధురాలిని అడగా.. జరిగిందంతా వివరించింది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 60 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల మైనర్ బాలుడి అత్యాచారానికి ఒడిగట్టిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobet