రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు – ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇక్కడొచ్చిన చిక్కంతా ఒక్కటే – లెక్కకు మించి నీతులు బోధించి; “రెండు లక్షల” సిద్ధాంతాలు జనానికి అందించి; ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చి; “అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చా” అని గొంతు పోయేలా అరిచి – ఒక “యావరేజ్ ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్”లోని ఒక ఫక్తు రాజకీయ పార్టీ లాగా రంగులు మార్చడమే విజ్ఞత ఉన్న వారెవరికైనా చిరాకు కలిగించే విషయం. “కులాల్ని […]
ప్రస్తుతం ప్రధాని హోదాలో ఉన్నా, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోడీ పలుమార్లు గడ్డుస్థితిని ఎదుర్కొన్నారు. అయినా తన మార్క్ రాజకీయాలతో వాటి నుంచి గట్టెక్కారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మోడీ అంటే గిట్టని వారికి ఆయన వైఖరి నచ్చకపోయినప్పటికీ ప్రస్తుతం మోడీ కి బలమైన అభిమానుల్లో కూడా తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు గమనిస్తుంటే […]
వై.యస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుండి చేస్తున్న పనులకి వివిధ వర్గాల నుండి ప్రశంశలు వస్తూనే ఉన్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు పొరుగు రాష్ట్రాల పాలకులు సైతం ఆకర్షితులవుతున్నారు. దిశా చట్టం పత్రాలను డిల్లీ , ఒడిస్సా ముఖ్యమంత్రులు కోరటం, రివర్స్ టెండరింగ్ పద్దతి గురించి ఇతర రాష్ట్రాలు ఆరా తీయటం లాంటి సంఘటనలతో ముఖ్యమంత్రి జగన్ దేశంలోని వివిధ రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. […]
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీకి టోపీ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటామని మాటలు, సీఎం కలిసినప్పుడు షేక్ హ్యాండివ్వడమే తప్ప ఏపీకి ఒరిగిందేమీ కనిపించడం లేదు. తాజాగా వరదలు, విపత్తుల సహాయ నిధి కింద కూడా ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయించలేదు. ఇటీవల కృష్ణా, గోదావరి వరదల్లో ఏపీలోని ఐదారు జిల్లాల్లో అపార నష్టం జరిగింది. కేంద్రం వరద బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా వ్యవహరిస్తుందనే ఆశాభావంతో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ మొండిచేయి తప్పలేదు. తాజాగా అమిత్ […]
రాజకీయ నాయకులకు మీడియా అండదండలు చాలా అవసరం. మీడియా చెప్పుచేతల్లో ఉంటే తాము చేసే ప్రతి పనీ అమోఘం అని, అదే పని అవతలి పక్షంలో వారు చేస్తే ఛండాలం అనీ మీడియా చేత ఊదరగొట్టించవచ్చు. ఈ విషయం ఎనిమిది దశాబ్దాల క్రితమే అడాల్ఫ్ హిట్లర్ కనిపెట్టాడు. ప్రాపగాండా మంత్రిత్వ శాఖ ఒకదానిని సృష్టించి, దానికి జోసెఫ్ గోబెల్స్ అనే వాడిని మంత్రిగా నియమించాడు. హిట్లర్ చేసే ప్రతి పనికీ జనంలో మద్దతు కూడగట్టేలా ప్రచారం చేయడం […]
ఒకటే పార్టీ.. కానీ రెండేళ్లు తిరిగే లోగా మూడు స్వరాలు వినిపిస్తోంది. ఒకే నాయకుడి పట్ల విభిన్న గొంతులతో స్పందిస్తున్న తెలుగుదేశం పార్టీ తీరు విస్మయరంగా కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ నేతలు బెరుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. మోడీ అంతటి మొనగాడు లేడని చెప్పిన వాళ్ళే, ఆయనే పెద్ద మోసగాడు అంటూ నినదించారు. ఇప్పుడు మళ్లీ మహానుభావుడిగా కీర్తించడం మొదలు పెట్టారు. 2018 ఫిబ్రవరి వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల టిడిపి నేతలు సానుకూలంగా వ్యవహరించారు. […]
2014 ఎన్నికల రోజులు… ఎటు చూసినా అవినీతి ఆరోపణలు బొగ్గు కుంభకోణం,2G స్కాం,కామన్ వెల్త్ స్కాం లక్షల కోట్ల ఆరోపణలు నిత్యం మీడియాలో వార్తలు. ఒక వైపు అరవింద్ కేజ్రీవాల్ మరోవైపు మోడీ అవినీతి రహిత పాలన వాగ్ధానంతో ప్రజలు మద్దతు కోరుతూ ప్రచారం చేశారు. బీజేపీ గెలిచింది మోడీ ప్రధాని అయ్యారు, ప్రభుత్వం మీదు రఫెల్ తప్ప మరొక అవినీతి ఆరోపణ రాలేదు కానీ బ్యాంకులను ముంచిన, ఇతర ఆర్ధిక నేరాలకు పాల్పడ్డ వ్యాపారవేత్తలను రక్షిస్తున్నారన్న […]
రాజకీయ నేతలు, సినీ నటులకు గుడులు నిర్మించే తమిళనాడులో తాజాగా మరో గుడి వెలిసింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ముగ్ధుడైన ఓ తమిళ రైతు మోదీకి గుడి కట్టాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి 63 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరకుడి గ్రామం లో పి.శంకర్ అనే రైతు మోదీ గుడిని ప్రారంభించాడు. అక్కడ మోదీ ప్రతిమకు ప్రతిరోజూ హారతి ఇస్తున్నాడు. తను ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందానని, ఆయనంటే తనకెంతో అభిమానమని శంకర్ పేర్కొన్నాడు. […]
పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్యలో మొదలైన నిరసనలు ఆపై హింసాత్మకంగా మారి దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రైళ్లు, బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాధికారులు వాహనాలు.. ఇలా కనిపించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నిరసనకారుల్ని ఉద్దేశించి బుధవారం ఉత్తరప్రదేశ్‌లో మాట్లాడారు. నిరసనకారులు చేస్తున్నది తప్పో ఒప్పో ఒక సారి ప్రశాంతంగా ఆలోచన చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ […]
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కోల్ కతా లో బిజెపి భారీ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర కుమార్ బోస్ పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు వ్యతిరేకంగా ట్వీట్ చెయ్యడం పెద్ద దుమారాన్ని లేపుతుంది. బిజెపి పశ్చిమ బెంగాల్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర కుమార్ బోస్ పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ ) కు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తూ భారతదేశం అన్ని వర్గాలను మతాలను ఆహ్వానించే దేశమని స్పష్టం చేశారు. సిఏఏ కి […]