iDreamPost
android-app
ios-app

తమిళనాడులో మోడీకి గుడి

  • Published Dec 26, 2019 | 2:15 AM Updated Updated Dec 26, 2019 | 2:15 AM
  • Published Dec 26, 2019 | 2:15 AMUpdated Dec 26, 2019 | 2:15 AM
తమిళనాడులో మోడీకి గుడి

రాజకీయ నేతలు, సినీ నటులకు గుడులు నిర్మించే తమిళనాడులో తాజాగా మరో గుడి వెలిసింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ముగ్ధుడైన ఓ తమిళ రైతు మోదీకి గుడి కట్టాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి 63 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరకుడి గ్రామం లో పి.శంకర్‌ అనే రైతు మోదీ గుడిని ప్రారంభించాడు. అక్కడ మోదీ ప్రతిమకు ప్రతిరోజూ హారతి ఇస్తున్నాడు. తను ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందానని, ఆయనంటే తనకెంతో అభిమానమని శంకర్‌ పేర్కొన్నాడు. గుడి నిర్మాణానికి లక్షా ఇరవై వేల రూపాయల ఖర్చు చేశారు.

కాగా, గతంలోనూ తమ అభిమాన రాజకీయ నేతలకు, సినీ నటులకు తమిళనాడు లో అభిమానులు గుడులు కట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, సినీ నటి నమిత తదితరులు జాబితాలో ఉన్నారు.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet