ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని తెలుగువాడి విజయపతాకాన్ని అంతర్జాతీయ వీధుల్లో ఎగరేసిన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం టాలీవుడ్ నే కాదు యావత్ సినీ ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తుతోంది. కేవలం రోజుల వ్యవధిలో ఇన్నేసి శుభవార్తలు వినాల్సి రావడం కుటుంబానికే కాదు ఫ్యాన్స్ ని అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. లేట్ ఏజ్ లోనూ ఇంత గొప్ప ఖ్యాతిని అందుకుంటున్న […]
తెలుగువాడి ఛాతి గర్వంతో ఉప్పొంగిపోయే విజయంలో ఆర్ఆర్ఆర్ మొదటి మెట్టు ఎక్కేసింది. కోట్లాది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తుండగా ప్రకటించిన నామినేషన్లలో నాటు నాటు చోటు దక్కించుకుంది. ఎంఎం కీరవాణి పేరుతో పాటు సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్ నామధేయం కూడా ఇంటర్నేషనల్ స్టేజి మీద కనిపించం అద్భుత క్షణంగా చెప్పుకోవాలి. అయితే నాటునాటుకి పోటీ అంత సులభంగా ఉండటం లేదు. ఇదే విభాగంలో చాలా తీవ్రమైన కాంపిటీషన్ రాజమౌళి బృందానికి పెద్ద సవాల్ గా నిలవనుంది టెల్ […]
ఎలాగైనా ఆస్కార్ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఆర్ఆర్ఆర్ మెల్లగా ఒక్కో అడుగు దానివైపు వేసుకుంటూ వెళ్తోంది. రిలీజై తొమ్మిది నెలలవుతున్నా ఇంకా సోషల్ మీడియాలో దాని గురించిన చర్చ జరుగుతోందంటే రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలబెట్టేందుకు చేస్తున్న కృషి ఫలితమే. జపాన్ విజయవంతంగా ముత్తుని దాటేసి నెంబర్ వన్ ప్లేస్ ని కొట్టేసిన ట్రిపులార్ ఇప్పటికీ కెనడా లాంటి దేశాల్లో ప్రీమియర్లు జర్పుకుంటూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ వచ్చాక ఒరిజినల్ ఫీల్ […]
బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే ఒకే పేరు సుమ. మే6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కానప్పటికీ, ఫర్వాలేదనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. జూన్14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కంటెంట్ కు భిన్నంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచిన కథను ఎంచుకున్నారు సుమ. […]
2022 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సంచలనాలు ఆగేలా కనిపించడం లేదు. రికార్డుల సునామికి బ్రేకులు పడటం లేదు. నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. తెలుగు సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే తమిళనాడులో నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయంటేనే సీన్ ఏ రేంజ్ లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 900 కోట్ల గ్రాస్ ని సగర్వంగా అందుకున్న ఈ రాజమౌళి మల్టీ స్టారర్ ఇంకొద్ది […]
ఇవాళ్టితో ఆర్ఆర్ఆర్ మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. నేపాల్ లాంటి దేశంలో సైతం రోజుకు కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నైజామ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 70 కోట్లను కేవలం ఆరు రోజుల్లోనే అందుకుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. సీడెడ్ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. నార్త్ లో ఆల్రెడీ 120 కోట్లను దాటేసిన రాజమౌళి మేజిక్ ఈ […]
ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా రాజమౌళి విజువల్ గ్రాండియర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తోంది. వీక్ డేస్ లో సహజంగా ఉండే డ్రాప్ పర్సెంటేజ్ కు భిన్నంగా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేయడం గమనార్హం. ఇక్కడే కాదు అటు నార్త్ తో మొదలుపెడితే పక్కన తమిళనాడు దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా రివ్యూలు చాలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు తమ స్టార్ల […]
గత కొన్నేళ్లలో బాహుబలి స్థాయిలో ఒక సినిమా జనంలో విపరీతమైన ఉద్వేగాలను కలుగజేసి ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించేలా చేసింది ఆర్ఆర్ఆరే. గత రెండేళ్లలో కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడినప్పటికీ ఏ మాత్రం ఆసక్తి తగ్గకుండా అంతకంతా హైప్ పెంచుకుంటూ పోయిన ఈ మల్టీ స్టారర్ విజువల్ గ్రాండియర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. థియేటర్ల వద్ద కనివిని ఎరుగని పండగ వాతావరణం నెలకొంది. […]
ఏమో ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. విడుదల 25 అయినప్పటికీ రేపు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబి మాల్ లో స్పెషల్ సెలబ్రిటీ షో వేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఆ మేరకు బుక్ మై షోలో బ్లాక్ చేసిన బుకింగ్ అలా పెట్టినట్టే పెట్టి తీసేశారు. దీని తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకవేళ ఇది నిజమే అయినా సాధారణ అభిమానులకు చూసేందుకు సాధ్యం కాదు. ఎందుకంటే […]
నిన్న రాత్రి విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్ట్ క్లైమాక్స్ వీడియో సాంగ్ కు రెస్పాన్స్ బాగానే వస్తోంది. నాటు నాటు రేంజ్ కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు అలియాతో కలిసి చేసిన డాన్స్ కి ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది థియేటర్ వెర్షన్ లో ఉంటుందా లేదానేది చెప్పలేదు కానీ మూడు గంటల నిడివి తర్వాత దీన్ని ఉంచుతారా తీసేస్తారా 25నే తెలుస్తుంది. ఈ పాట డిజైనింగ్ లో రాజమౌళి మంచి తెలివితేటలు చూపించారు. […]