iDreamPost
android-app
ios-app

RRR : 17 రోజుల ముందుగానే వసూళ్ల హంగామా

  • Published Mar 08, 2022 | 2:59 PM Updated Updated Dec 22, 2023 | 6:51 PM

తెలుగువాళ్లే కాక సగటు సినీ ప్రేమికులందరూ ప్రీమియర్లు చూడాలని ఫిక్స్ అయిపోవడంతో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. రాధే శ్యామ్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకా రెండో విడత ప్రమోషన్లు మొదలుపెట్టనప్పటికీ అభిమానులు మాత్రం రోజులను లెక్కబెట్టుకుంటూ 25 కోసం ఎదురు చూస్తున్నారు.

తెలుగువాళ్లే కాక సగటు సినీ ప్రేమికులందరూ ప్రీమియర్లు చూడాలని ఫిక్స్ అయిపోవడంతో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. రాధే శ్యామ్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకా రెండో విడత ప్రమోషన్లు మొదలుపెట్టనప్పటికీ అభిమానులు మాత్రం రోజులను లెక్కబెట్టుకుంటూ 25 కోసం ఎదురు చూస్తున్నారు.

  • Published Mar 08, 2022 | 2:59 PMUpdated Dec 22, 2023 | 6:51 PM
RRR : 17 రోజుల ముందుగానే వసూళ్ల హంగామా

విడుదలకు ఇంకో 17 రోజులు ఉండగానే రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ రికార్డుల పర్వం మొదలుపెట్టింది. యుఎస్ లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 మిలియన్ మార్క్ అందుకుని రిలీజ్ అయ్యాక అరాచకం ఏ స్థాయిలో ఉండబోతోందో ముందే హింట్ ఇస్తోంది. తెలుగువాళ్లే కాక సగటు సినీ ప్రేమికులందరూ ప్రీమియర్లు చూడాలని ఫిక్స్ అయిపోవడంతో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. రాధే శ్యామ్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకా రెండో విడత ప్రమోషన్లు మొదలుపెట్టనప్పటికీ అభిమానులు మాత్రం రోజులను లెక్కబెట్టుకుంటూ 25 కోసం ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ గ్రాండ్ గా ఉండబోతున్నాయి.

నిన్న ఏపి నుంచి టికెట్ రేట్ల జిఓ వచ్చేయడంతో డిస్టిబ్యూటర్లు నిర్మాత డీల్స్ ఫైనల్ చేసే పనిలో పడ్డారు. రాధే శ్యామ్ ట్రిపులార్ రిలీజ్ టైంకి మూడో వారంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు ఆర్ఆర్ఆర్ కు వచ్చేలా ఎగ్జిబిటర్లు రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలుపెట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక బెనిఫిట్ షోలు వేసే రోజు టికెట్ల కోసం యుద్ధాలు గొడవలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఆ స్థాయిలో హైప్ ఉంది మరి. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని భీభత్సమైన పబ్లిసిటీ చేసిన జక్కన్న బృందం మళ్ళీ ఈ నెల మూడో వారం నుంచి గేర్ మార్చనుంది.

ఓవర్సీస్ లో రాధే శ్యామ్ సెట్ చేయబోయే బెంచ్ మార్క్ ఆర్ఆర్ఆర్ ఈజీగా ఓవర్ టేక్ చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ప్రభాస్ మూవీ ఇంకా అడ్వాన్స్ మిలియన్ మార్క్ టచ్ చేయలేదు. ఆన్ లైన్ సేల్ కొంత ఆలస్యంగా స్టార్ట్ చేయడం ప్రభావం చూపించింది. ఆర్ఆర్ఆర్ కోసం చరణ్ తారక్ లు తిరిగి ఫ్రెష్ గా ప్రమోషన్లు చేయబోతున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ ఈవెంట్లు ఉండబోతున్నాయి. ముంబై, చెన్నైలో అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఉండకపోవచ్చు. వెన్యూ డేట్లు త్వరలోనే ప్రకటించబోతున్నారు. బుకింగ్స్ విషయంలో యుఎస్ లోనే పరిస్థితి అలా ఉంటే 25 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో వేరే చెప్పాలా

Also Read : Vijay Sethupathi & Katrina Kaif : ఊహించని కాంబోతో క్రైమ్ థ్రిల్లర్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet