iDreamPost
android-app
ios-app

RRR Premiers : చెప్పిన టైం కంటే ముందే ట్రిపులార్ రచ్చ ?

  • Published Mar 23, 2022 | 6:30 PM Updated Updated Mar 23, 2022 | 6:30 PM
RRR Premiers : చెప్పిన టైం కంటే ముందే ట్రిపులార్ రచ్చ ?

ఏమో ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. విడుదల 25 అయినప్పటికీ రేపు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబి మాల్ లో స్పెషల్ సెలబ్రిటీ షో వేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఆ మేరకు బుక్ మై షోలో బ్లాక్ చేసిన బుకింగ్ అలా పెట్టినట్టే పెట్టి తీసేశారు. దీని తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకవేళ ఇది నిజమే అయినా సాధారణ అభిమానులకు చూసేందుకు సాధ్యం కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలోనే ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు చూద్దామాని ఎదురు చూస్తున్న ప్రముఖులు వేలలో ఉన్నారు. వారిని కాదని బయటివాళ్ళు అందులోకి వెళ్లడం అసాధ్యం. పెయిడ్ షో కాబట్టి ధర కూడా చాలా ఎక్కువ ఉంటుంది.

ఇదొక్కటే కాదు ముంబైలోనూ ఈ తరహాలో ప్రీమియర్ ను రేపు సాయంత్రం ప్లాన్ చేశారట. గతంలో బాహుబలిని రిలీజ్ కు ముందు కరణ్ జోహార్ తదితర ప్రముఖులకు ప్రత్యేకంగా చూపించాడు రాజమౌళి. తెలుగు రాష్ట్రాల్లో షో పడకముందే అక్కడి నుంచి వచ్చిన టాక్ బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడూ అదే రిపీట్ చేయాలనే ఆలోచన ఉంది కాబోలు. కాకపోతే దీని గురించి బయటికి చెప్పకుండా మేనేజ్ చేస్తున్నారని తెలిసింది. మీడియా ప్రతినిధులకు శుక్రవారం ఉదయం కన్నా ముందు వేసే ఛాన్స్ లేదు. సో వాళ్ళతో సహా అందరూ వెయిట్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ఏపి తెలంగాణలో తెల్లవారుఝామున 4 నుంచి 5 మధ్యలో ఆర్ఆర్ఆర్ మొదలవుతుంది.

ఒక్క భాగ్యనగరంలోనే మొదటి రోజు అడ్వాన్ బుకింగ్ 7 కోట్లు దాటినట్టు సమాచారం. ఇది కొత్త రికార్డు. వీకెండ్ కూడా దాదాపు సోల్డ్ అవుట్ అయిపోయింది. నార్త్ లో మెల్లగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. నిన్నటిదాకా కొంత డల్ గా కనిపించిన ట్రెండ్ ఇవాళ ఊపందుకుంది. రెస్ట్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు చేస్తున్న ప్రమోషన్లు బాగా వెళ్తున్నాయి. ఇదంతా ఓకే కానీ ప్రీమియర్ల వార్త నిజమైతే మాత్రం రేపు అర్ధరాత్రికి ముందే టాక్ వచ్చేస్తుంది,. యుఎస్ లో పడే షోలు మన టైమింగ్ ప్రకారం రేపు రాత్రి 11కే పడతాయి. సో ఎగ్జైట్మెంట్ ఇప్పుడు రోజుల్లో నుంచి గంటల్లోకి మారిపోయింది. కౌంట్ డౌన్ చేసుకోవడమే బ్యాలన్స్

Also Read : RRR & James : ఆర్ఆర్ఆర్ మీద పునీత్ ప్రభావం ఉంటుందా