iDreamPost
android-app
ios-app

విశ్వంభర విషయంలో గుడ్ న్యూస్..

  • Published Jul 11, 2025 | 10:34 AM Updated Updated Jul 11, 2025 | 10:34 AM

Vishwambhara: మెగా అభిమానులతో పాటు.. మూవీ లవర్స్ కూడా ఎదురుచూసి చూసి అలసిపోయారు. సరే సినిమా వచ్చినప్పుడే చూసుకుందాంలే అనే ఆలోచనకు వచ్చేసారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా గురించి కాస్త బజ్ పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ , ఐటెం సాంగ్ బ్యాలన్స్ ఉందనే టాక్ వచ్చింది.

Vishwambhara: మెగా అభిమానులతో పాటు.. మూవీ లవర్స్ కూడా ఎదురుచూసి చూసి అలసిపోయారు. సరే సినిమా వచ్చినప్పుడే చూసుకుందాంలే అనే ఆలోచనకు వచ్చేసారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా గురించి కాస్త బజ్ పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ , ఐటెం సాంగ్ బ్యాలన్స్ ఉందనే టాక్ వచ్చింది.

  • Published Jul 11, 2025 | 10:34 AMUpdated Jul 11, 2025 | 10:34 AM
విశ్వంభర విషయంలో గుడ్ న్యూస్..

మెగా అభిమానులతో పాటు.. మూవీ లవర్స్ కూడా ఎదురుచూసి చూసి అలసిపోయారు. సరే సినిమా వచ్చినప్పుడే చూసుకుందాంలే అనే ఆలోచనకు వచ్చేసారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా గురించి కాస్త బజ్ పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ , ఐటెం సాంగ్ బ్యాలన్స్ ఉందనే టాక్ వచ్చింది. ఆ సాంగ్ కొత్తగా కంపోజ్ చేసేంత టైం లేక చిరు ఓల్డ్ మూవీలోని ఓ ఐకానిక్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారట. దీని గురించి ఇంకా అధికారికంగా అయితే అనౌన్సుమెంట్ లేదులే కానీ.. సినీ వర్గాల్లో మాత్రం దీని గురించి బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు విశ్వంభర విషయంలో వినిపిస్తున్న మ్యాటర్ విషయానికొస్తే..

ఓ వైపు మెగా 157 జెట్ స్పీడ్ లో దూసుకుపోవడంతో.. విశ్వంభర మీద అందరి ఆసక్తి నెలకొంది. ఈపాటికి రిలీజ్ అయ్యి రిజల్ట్ గురించి మాట్లాడుకోవాల్సింది పోయి.. ఇంకా ఎదురుచూపులు చూడడం ఓ వైపు ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. దీనితో విశ్వంభర మేకర్స్ కూడా కాస్త అలర్ట్ అయ్యి స్పీడ్ పెంచుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను సెప్టెంబర్ 18న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం . ఆ తర్వాత సరిగ్గా వారంలోనే అంటే సెప్టెంబర్ 25 న ఓజి రిలీజ్ ఉంది. మరి అన్న కోసం తమ్ముడు వెనక్కు తగ్గుతాడా.. లేదా యధావిధిగా అనుకున్న ప్రకారంగా సినిమాలు చెప్పిన టైం కు రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు చెప్పిన టైం కు రిలీజ్ కావడం లేదు. దీనితో ప్రేక్షకులు కూడా కాస్త నిరాశ పడుతున్న మాట వాస్తవం. సో ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకులను మెప్పించాలంటే.. మూవీ మేకర్స్ ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ ఇవ్వడం , ప్రమోషన్స్ , ఈవెంట్స్ లాంటి వాటితో సినిమాను ప్రేక్షకులలో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ విశ్వంభర ఎంత వరకు ఇప్పుడు అనుకున్న డేట్ ను లాక్ చేసుకుంటుందో చూడాలి. ఆగస్టు 22 న చిరు బర్త్డే ఉంది కాబట్టి.. కచ్చితంగా మూవీ నుంచి ఎదో ఒక అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. అటు అనిల్ రావిపూడి కూడా మెగా 157 నుంచి అప్డేట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు.సో ఇక చిరంజీవి సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.