iDreamPost
iDreamPost
నిన్న రాత్రి విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్ట్ క్లైమాక్స్ వీడియో సాంగ్ కు రెస్పాన్స్ బాగానే వస్తోంది. నాటు నాటు రేంజ్ కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు అలియాతో కలిసి చేసిన డాన్స్ కి ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది థియేటర్ వెర్షన్ లో ఉంటుందా లేదానేది చెప్పలేదు కానీ మూడు గంటల నిడివి తర్వాత దీన్ని ఉంచుతారా తీసేస్తారా 25నే తెలుస్తుంది. ఈ పాట డిజైనింగ్ లో రాజమౌళి మంచి తెలివితేటలు చూపించారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్వతంత్ర సమరయోధులు, కీర్తివీరుల ఫోటోలు చూపించి వాటికి తగ్గట్టు ఇద్దరు హీరోలతో ఆ గెటప్పులు వేయించి డాన్సులు చేయించడం రిచ్ పెంచడానికి ఉపయోగడుతోంది.
ముఖ్యంగా వీర శివాజీని చూపించి మరాఠా సెంటిమెంట్ ని టచ్ చేయడం ద్వారా హిందీ వెర్షన్ కు మంచి బజ్ తీసుకొచ్చారు జక్కన్న. దీని ప్రభావం సోషల్ మీడియాలో అప్పుడే కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల ఎమోషన్స్ ని టచ్ చేసే విధంగా కాస్ట్యూమ్స్ ని గట్టిగానే డిజైన్ చేయించారు. అలియాను మాములుగా చూపించినప్పటికీ చరణ్ తారక్ లను చూడ్డానికే సరిపోయింది కాబట్టి తన గురించి పెద్దగా డిస్కషన్ లేదు. అయితే మ్యూజికల్ యాంగిల్ లో చూసుకుంటే కీరవాణి స్వరపరిచిన ఈ ఎత్తర జెండా ఆడియో పరంగా అంతగా కిక్ ఇచ్చే స్థాయిలో లేదు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా పర్వాలేదనిపించుకుంది అంతే.
మొత్తానికి దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కు గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చేలా రాజమౌళి టీమ్ వేసిన ప్లాన్ ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇవాళ ఓ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా తెలుగు మీడియా కోసం చేస్తున్నారు. అదనపు షోలు, టికెట్ రేట్లకు సంబంధించిన ప్రభుత్వాలతో చర్చలు సంప్రదింపులు మరోపక్క జరుగుతూనే ఉన్నాయి. 24 సాయంత్రమే ప్రీమియర్లు పడబోతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. షో టైం రేపో ఎల్లుండో తెలియనుంది. మొదటి రోజు నమోదు కాబోయే రికార్డుల మీదే అందరి చూపు ఉంది. రిలీజ్ కు ముందే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని మోస్తున్న ఆర్ఆర్ఆర్ అంచనాలు కనక సరిగ్గా అందుకుంటే కలెక్షన్లకు ఆకాశమే హద్దు
Also Read : Allu Arjun : ఐకాన్ స్టార్ పాన్ ఇండియా ప్లాన్స్