iDreamPost
android-app
ios-app

పాడుతా తీయగాలో SP బాలుతో మెప్పుపొందిన ఈ పాప.. ఇప్పుడు స్టార్ సింగర్ అని తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? పాడుతా తీయగా, జీ సరిపగమప లిటిల్ చాంప్స్ వంటి కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేసింది. లెజండరీ సింగర్ బాలసుబ్రమణ్యంతో ప్రశంసలు పొందిన ఈ పాప.. ఇప్పుడు స్టార్ సింగర్

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? పాడుతా తీయగా, జీ సరిపగమప లిటిల్ చాంప్స్ వంటి కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేసింది. లెజండరీ సింగర్ బాలసుబ్రమణ్యంతో ప్రశంసలు పొందిన ఈ పాప.. ఇప్పుడు స్టార్ సింగర్

పాడుతా తీయగాలో SP బాలుతో మెప్పుపొందిన ఈ పాప.. ఇప్పుడు స్టార్ సింగర్ అని తెలుసా..?

గానగంధర్వుడు, ప్రముఖ స్టార్ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యాన్నికొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. తన పాటలతో ఎంతో మంది శ్రోతలను ఓలలాడించారు. ఈ లెజండరీ సింగర్ మన మధ్య లేనప్పటికీ.. ఆయన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన కళను తన వద్దనే అట్టిపెట్టుకోలేదు. పది మందికి పంచారు. తనలాంటి ఎంతో మంది అప్ కమింగ్ సింగర్స్‌ను పాడుతా తీయగా అనే రియాలిటీ షో ద్వారా పదును పెట్టి.. తెలుగు పరిశ్రమకు అందించారు. ఈటీవీలో 25 సంవత్సరాలకు పైగా ఈ షో ప్రసారమైంది. సింగర్స్ కావాలనుకున్న వారికి ఓ వేదికగా మారింది. యంగ్, చైల్ట్ సింగర్స్‌ను పరిచయం చేశాడు. వారిలో ఒకరు ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి..తన పాటతో ఆకట్టుకుంటున్న ఈ కుట్టీ సింగర్ పేరు సాహితీ. ఈమె ఎవరో తెలుసా..? ప్రముఖ సింగర్, మ్యూజిక్ టీచర్ రామాచారి కూతురు.

రామాచారి కూతురే ఈ సాహితీ కొమండూరి అలియా సోనీ. చిన్నప్పటి నుండి మ్యూజిక్ ప్రపంచంలోనే పెరిగిన సాహితీ..తండ్రి దగ్గర సంగీతంలో అక్షరాభ్యాసాలు తీర్చిదిద్దింది. అలా పలు కాంపిటీషన్లలో పాడింది. పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసింది. జూనియర్స్ విభాగంలో కంటెస్టెంటుగా ఆకట్టుకుంది. బాల సుబ్రమణ్యంతో మెప్పుపొందింది. జీ సరిగమ లిటిల్ ఛాంప్స్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది. చిన్నప్పటి నుండి ప్రముఖ సింగర్ కీరవాణి దగ్గర చిన్న పిల్లలకు కోరస్ పాడింది. అలా ఆమె బాహుబలి 2లో ఓ పాట పాడి సక్సెస్ అయ్యింది. ‘ఓరోరి రాజా, వీరాధి వీరా’ సాంగ్ పాడి ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ పాటతోనే ఫేమ్ తెచ్చుకుంది.  ఈ సినిమాతో వరుసగా పాటలు పాడింది. మాస్ అండ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ చేసింది సాహితీ.  ఆమె కర్ణాటక, హిందూస్తానీ సంగీతాన్ని కూడా నేర్చుకుంది.

sony komanduri pic talk

బాహుబలి 2 తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సూపర్ మచ్చి, కిస్మత్, సర్కార్ వారి పాట, సామజవరగమన, స్కందలో కల్ట్ మామ సాంగ్స్ పాడింది సాహితీనే.ఇవే కాకుండా కన్నడలో కూడా పలు పాటలు పాడింది. అలాగే డివోషనల్ సాంగ్స్ పాడి ఆకట్టుకుంది. ఈటీవీలో ప్రసారమౌతున్న సామజవరగమన, స్వరాభిషేకంలో కూడా తన గళాన్ని వినిపించింది. కేవలం క్లాసికల్ మాత్రమే కాదు వెస్ట్రన్ సాంగ్స్ కూడా అదరగొడుతుంది ఈ స్టార్ సింగర్. తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణికి ఎప్పుడూ రుణ పడి ఉంటానని చెప్పింది. సాహితీ మాత్రమే కాదు.. ఆమె అన్న కూడా ఫేమస్ సింగరే. అతడే ప్రముఖ సింగర్ సాకేత్. దిమ్మాక్ కరాబే సాంగ్ పాడి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఇటు తెలుగు ఇండస్ట్రీలో, అటు క న్నడ ఇండస్ట్రీలో పాటలు పాడుతున్నారు. మొత్తానికి తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 𝐒𝐏𝐁𝐂𝐇𝐀𝐑𝐀𝐍 𝐅𝐀𝐍𝐒𝐂𝐋𝐔𝐁 (@spbcharan_sir_vocals)