గుజరాత్ లోని ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రెండు నెల్లుగా మధ్యాహ్న భోజనం మానేశారు. అదేమంటే దళిత మహిళ వండుతున్న వంట తినమని సమాధానమిచ్చారు. ఈ విషయలో పిల్లలను, వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి స్కూలు యాజమాన్యం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోర్బీ జిల్లా సోఖ్డా గ్రామంలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూలు పిల్లలు జూన్ 16 నుంచి మధ్యాహ్న భోజనం తినడం లేదు. స్కూల్లో మొత్తం 153 మంది పిల్లలుండగా […]
క్రమశిక్షణ పేరుతో ఓ టీచర్ బాలికల చేత 200 గుంజీలు తీయించింది. ఆ పిల్లలు హాస్పిటల్ పాలు కావడంతో విషయం బయటికొచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ లో కావేరమ్మ పేటలోని ఓ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ లో బుధవారం ఈ దారుణం జరిగింది. రెండు జళ్ళు వేసుకోలేదన్న కారణంతో PET శ్వేత 50 మంది అమ్మాయిలతో 120 నుంచి 200 దాకా గుంజీళ్ళు తీయించింది. దీంతో పిల్లలు నడవలేకపోయారు. ఒళ్ళు నొప్పులతో కొందరికి […]
ప్రజలకు మంచి చేయాలనే తపన పాలకుడికి ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఈ విషయాన్నే నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్.. దీనికి కొనసాగింపుగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నిర్ణయం తీసుకోవడమే కాదు.. రాబోయే విద్యా సంవత్సరం […]
స్కూళ్ల రూపు రేఖలు మారిపోతున్నాయి. మొదటి దశలో కాంపౌండ్ గోడ, టాయిలెట్ల నిర్మాణం పూర్తవుతోంది. విద్య విషయంలో జగన్ చాలా పట్టుదలగా ఉన్నాడు. నాడు-నేడు పథకంలో నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ పనులకి మొత్తం ఏడుగురు (హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ) బాధ్యులుగా ఉంటారు. పనుల నాణ్యతని ఇద్దరు ఇంజనీర్లు పరిశీలిస్తారు. జాయింట్ అకౌంట్ కాబట్టి ప్రతి రూపాయికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెటీరియల్ కొనుగోలు, పనులని అప్పజెప్పడం, అన్నీ కూడా పారదర్శకంగా జరగాల్సిందే. […]
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయానికి దోహదం చేసిన కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది విద్యా వ్యవస్థలో సంస్కరణలు. కార్పొరేట్ స్కూళ్లను మించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది ఆప్ ప్రభుత్వం. ఈ విద్యా విధానం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆకర్షించింది. ఎన్నో ప్రత్యేక బందాలు వెళ్లి.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలను పరిశీలిస్తుంటాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలపై […]
నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి సీఎం జగన్ను అసెంబ్లీ వద్ద కలిసి పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం బయటికి వచ్చిన కైలాశ్ సత్యార్థి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అవటం ఆనందంగా ఉందని తెలిపారు . ప్రభుత్వ పాఠశాలలో విధ్యార్ధుల కొరకు ఏర్పాటు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి , కల్పిస్తున్న వసతుల గురించి చర్చించామని, పాఠశాల విద్యలో జగన్ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ మోడల్ స్టేట్గా నిలుస్తుందని […]