Idream media
Idream media
ప్రజలకు మంచి చేయాలనే తపన పాలకుడికి ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఈ విషయాన్నే నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్.. దీనికి కొనసాగింపుగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నిర్ణయం తీసుకోవడమే కాదు.. రాబోయే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని తలపోశారు. 1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈలో విద్యా బోధన చేసి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక తరగతి చొప్పన అమలు చేస్తూ పోవాలని అధికారులకు దిశానిర్థేశం చేశారు. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 1 నుంచి 10వ తరగతి వరకూ బోధన అంతా సీబీఎస్‌ఈలోనే జరిగేలా విప్లవాత్మక సంస్కరణకు నాంధి పలికారు.
అతి కొద్ది మందికే..
సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించే ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు అతి తక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతున్నా.. ఆయా సంస్థలు అన్నీ కూడా స్టేట్ సిలబస్‌నే బోధిస్తాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాల్లోనే అతి కొద్ది కార్పొరేట్ పాఠశాలల్లోనే సీబీఎస్‌సీ సిలబస్ అమలు చేస్తున్నారు. ఆయా జిల్లాలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేసే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇక్కడ ఫీజులు కూడా ఆకాశంలో ఉంటాయి. ఒకటో తరగతికి లక్ష రూపాయలు ఫీజు ఉంటుంది. ధనవంతులు, ఉన్నతాధికారులే తమ పిల్లలను ఇక్కడ చేర్పిస్తుంటారు. ఇలాంటి విద్యను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పిల్లలందరికీ అందించాలని నిర్ణయించడం గొప్ప విషయం.
సమస్యకు శాశ్వత పరిష్కారం..
మంచి భవిష్యత్ ఉండాలంటే చదువుకావాలి. అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలనే తమ శక్తికి మించి ఫీజులు ఉన్నా.. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు అతి తక్కువ. డిగ్రీ, పీజీ చేసిన వారిని టీచర్లుగా నియమించుకుని వారికి అరకొర జీతాలు ఇస్తున్నాయి. అదే ప్రభుత్వ పాఠశాల్లో టీటీసీ, బీఈడీ చదవి ప్రభుత్వం నిర్వహించే టెట్, డీఎస్సీ వంటి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సుశిక్షుతులైన ఉపాధాయులు ఉంటారు. అయతే ఇక్కడ తెలుగు మీడియంలో బోధన, సరైన మౌలిక వసతులు లేకపోవడంతో తల్లితండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకున్న సీఎం వైఎస్‌జగన్ మోహన్ రెడ్డి.. ఆ సమస్య పరిష్కారం వైపు వేగంగా అడుగులు వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీస్ మీడియం ప్రవేశపెట్టడం, నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు మిన్నగా మౌలిక వసతులు కల్పన, మధ్యాహ్నం భోజనం, జగనన్న విద్యా కానుక ద్వారా యూనీఫాం, బూట్లు, పుస్తకాలు, బెల్ట్, బ్యాగ్, టై అందించారు. దీంతో పాటు పిల్లలు చదువుకు ఆటంకం కలగకుండా, కుటుంబం గడిచేందుకు తల్లిదండ్రులు వారిని అప్పుడప్పుడు పనులకు పంపకుండా ఉండేందకు అమ్మ ఒడి పథకం పేరుతో ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తున్నారు.
దోపిడీ మూలాలు కదిలేలా..
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇన్నాళ్లు ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్ అని చెప్పుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు ఫీజుల పేరుతో దోపిడీ చేసిన ప్రైవేటు, కార్పొరేటర్ పాఠశాలలకు కల్లెం పడడం ఖాయమైంది. ఇకపై ఆయా కార్పొరేట్ పాఠశాలలు ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల కంటే గొప్ప మౌలిక సదుపాయలు ప్రభుత్వ పాఠశాల్లో ఉంటున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధన, సీబీఎస్‌ఈ సిలబస్ అమలు జరగబోతోంది. ఇంతకు మించి విద్యా రంగంలో ఉన్నత స్థాయి లేదు.
తండ్రిని మించిన తనయుడు..
విద్యతో అదీ నాణ్యమైన విద్యతోనే బతుకులు బాగుపడతాయి, పేదరికం తొలిగిపోతుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెబుతుండేవారు. అందుకే ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. తన తండ్రి వారసత్వాన్నే కాదు, ఆలోచనలను, ఆశయాలను అందిపుచ్చుకున్న సీఎం వైఎస్ జగన్.. ఆయన బాటలోనే నడుస్తూ ప్రజల తలరాతలను మార్చేందుకు పని చేస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాల ఫలితాలు రాబయే 7– 10 ఏళ్లలో కనిపిస్తాయనడంలో సందేహం లేదు.